టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా

ఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు.

  • Publish Date - April 15, 2019 / 09:23 AM IST

ఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు. ఏప్రిల్ 11న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరుగనుంది. తామే గెలుస్తామని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో 80 శాతం ఓటింగ్ జరిగింది. అధికారంలోకి తామే వస్తామని నేతలు చెబుతున్నారు. మే 23 తర్వాత సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని డొక్కా వెల్లడించారు.
Read Also : గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా

ఏప్రిల్ 15వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఈయన పోటీ చేశారు. ఇక్కడి నుండి 5 నుండి 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని వెల్లడించారు. ఫ్రీ అండ్ ఎయిర్ ఎలక్షన్స్ నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికలు జరపాలని బాబు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు దీనికి వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. టీడీపీకి అనుకూల వాతావరణం వచ్చిందని..మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు డొక్కా.
Read Also : 50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు