పీటాలు కదులుతున్నాయి : దేశంలోని బీడీ కార్మికుల గోస పట్టించుకున్నారా – కేసీఆర్

  • Publish Date - March 19, 2019 / 01:59 PM IST

భారతదేశంలో ఉన్న బీడీ కార్మికుల గోస ఏనాడైనా పట్టించుకున్నారా ? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు చెబితే తనను తిడుతున్నారని..తాను నిజం చెప్పడం లేదా ? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో ఏమైనా మేలు జరిగిందా ? కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. మార్చి 19వ తేదీ మంగళవారం సాయంత్రం స్థానిక గిరిరాజ్ మైదానంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించింది.

ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టారు. వారి పాలనలో దేశం అభివృద్ధి చెందలేదన్నారు. అందుకే తాను ఫెడరల్ ఫ్రంట్ కోసం కృషి చేస్తున్నట్లు, తాను వాస్తవాలు మాట్లాడితే ఎదురు దాడి చేస్తారా ? అంటూ నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఏవో విషయాలు ముందుకు తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. 

దేశంలో 52 లక్షల మంది బీడీ కార్మికులున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించారా ? తాము ఇచ్చిన విధంగా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు ప్రస్తుతం 2వేల రూపాయలు పెన్షన్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని కోరడం తప్పా ? అని కేసీఆర్ ప్రశ్నించారు.