గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మొన్న బాలికపై లక్ష్మారెడ్డిని అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆమెకు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అయితే జనసేన, టీడీపీ, దళిత, ప్రజా సంఘాల నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వాసిరెడ్డి పద్మను గంటసేపు అడ్డగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.