ఏపీలో హై అలర్ట్: పుత్తూరులో చొరబడిన ఉగ్రవాదులు

  • Publish Date - August 26, 2019 / 04:46 AM IST

తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే నిఘా అధికారుల హెచ్చరికలతో చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. పుత్తూరు గేట్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు నివాసాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో సోదాలు చేపట్టారు. గతంలో గేట్ పుత్తూరు వద్ద ఉగ్రవాది దొరికిన సంగతి తెలిసిందే. తిరుపతి అర్బన్ ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. శ్రీలంక నుంచి సముద్రమార్గం గుండా ఆరుగురు తీవ్రవాదులు తమిళనాడులో ప్రవేశించారని నిఘా అధికారులు హెచ్చరించారు. ఉగ్రవాదుల్లో ఒక పాకిస్తానీ, ఐదుగురు శ్రీలంక జాతీయులు ఉన్నట్లు సమాచారం.
Read More :త్వరలో ఏపీలో కొత్త ఇసుక విధానం: జగన్ ఆదేశాలు.. ప్రభుత్వం కసరత్తు

ఉగ్రవాదులకు బహ్రెయిన్‌లో స్థిరపడిన కేరళ వాసి సహాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కోయంబత్తూరు, తిరువాన్నమలై, వేలూరులో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఆలయాలు, రైల్వే స్టేషన్ల వద్ద అదనంగా బలగాలను మోహరించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపడుతున్నారు.