కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చిన కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో మృతి చెందిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ విషయంలో వారి గుమాస్తా నర్శింగ్ కొత్త విషయాలను వెల్లడించారు. జనవరి 26న సత్యనారాయణ రెడ్డి కార్లో వారి గుమాస్త నర్శింగ్ స్వయంగా లగేజ్ సర్దాడు. తరువాత 27 మధ్యాహ్నాం 3.30 గంటల సమయంలో సత్యనారాయణ రెడ్డి నర్శింగ్ కు నర్శింగ్ రీచార్జ్ చేయించాడు.
ఆ మరునాటి నుంచి అంటే 28 నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు అంటే సత్యనారాయణ రెడ్డి భార్య, కుమార్తెల ఫోన్లు స్విచ్చాప్ అయ్యాయి. ఆ తరువాత రోజు అంటే 29న సత్యనారాయణ రెడ్డి బంధువులు అతని ఇంటి తాళాలు పగులగొట్టి..ఇల్లంతా వెదికినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై నర్శింగ్ మాట్లాడుతూ..వాళ్ల అమ్మాయి వచ్చింది..తిరుపతిగానీ వెళ్తున్నారేమో అందుకే లగేజ్ తో వెళ్తున్నారని తాను అనుకున్నాననీ..కానీ ఇలా ముగ్గురు చనిపోయారనే వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తెలిపాడు.
ఈ విషయంపై పెద్ద పల్లి ఎమ్మెల్యే..మృతురాలి సోదరుడు అయిన దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..సత్యనారాయణ రెడ్డికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని అతను ఓ పెస్టిసైడ్స్ షాపు నడుపుతున్నారనీ..అతని భార్య..తన సోదరి అయిన రాధ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రమాదం జరగటం..దాంట్లో తన సోదరితో పాటు ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, వారి కుమార్తె వినశ్రీ మృతి చెందటం దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదం జరగటానికి మూడు రోజుల ముందు ఫోన్ మాట్లాడానని బైటకు వెళ్తున్నామని రాధ చెప్పిందని అన్నారు.
కానీ..జనవరి 26న మిస్ అయిన వారిపై ఇప్పటి వరకూ ఎందుకు సమాచారం ఇవ్వలేని ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా..వారు తరచూ టూర్ వెళ్తుంటారని అలా వెళ్లారని అనుకున్నాం తప్ప వారు ఇలా చనిపోతారని అనుకోలేదని స్పష్టంచేశారు.
కానీ..జనవరి 26న కారుతో సహా సోదరి కుటుంబం మొత్తం కనిపించకుండా పోయినా 22 రోజులుగా ఎందుకు వారి తరపు బంధువులు పట్టించుకోలేదు? పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇది కావాలని ఎవరైనా కుట్ర పన్ని చేశారా? లేదా నిజంగా కారు ప్రమాదవశాత్తు కాకతీయ కెనాల్ లో పడిపోయిందా? అలాగైతే వారు టూర్ కని వెళిన తరువాత జనవరి 29న సత్యనారాయణ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి బంధువులు ఎందుకు వెతికారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
కాగా..కరీంనగర్ జిల్లా ఆలగనూరు కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కాలువలో కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. వారు దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, బావ సత్యనారాయణ రెడ్డి, వారి కుమార్తె తనుశ్రీలుగా పోలీసులు గుర్తించారు.