హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు శుక్రవారం, సెప్టెంబర్ 25 నుంచి రొడెక్కనున్నాయి. నగరంలో 25 శాతం బస్సలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ మొదలైన తర్వాత నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసి సిటీ బస్సు సేవలు నిలిపివేశారు. దాదాపు 185 రోజుల తర్వాత తిరిగి సిటీ బస్సులు రోడెక్కనున్నాయి. ఇప్పటికే వివిధ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. రేపట్నించి సిటీ సర్వీసులు కూడా మొదలైతే నగర ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుంది.