కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. సెప్టెంబరు 28, శనివారం సాయంత్రం ఆయన విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీలో చేపట్టిన సంస్కరణల గురించి వైవీ గవర్నర్ కు తెలియజేశారు. శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు తేలిగ్గా దర్శనం చేయించేందుకు భవిష్యత్తులో చేపట్టనున్న విధి విధానాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ఈసందర్భంగా గవర్నర్ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని వైవీ పేర్కొన్నారు. సెప్టెంబరు 30న ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.