భవానీ కేసులో ట్విస్ట్ : DNA టెస్టుకు.. పెంచిన తల్లి డిమాండ్

  • Publish Date - December 8, 2019 / 08:23 AM IST

నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. విజయవాడ పడమట పీఎస్‌లో కంప్లయింట్ చేశారు పెంచిన తల్లి జయరాణి దంపతులు. 15 ఏళ్ల తర్వాత సొంత కుటుంబసభ్యులను భవానీ కలుసుకోగా.. ఇది ఫేస్ బుక్ ద్వారా జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే భవానీని అప్పగించాలంటే డీఎన్ఏ టెస్టులు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది పెంపుడు తల్లి జయరాణి.

ఇన్నేళ్ల తర్వాత అడ్రసు దొరికినప్పుడు, అమ్మాయి తమదేనన్న ఆధారాలు చూపించాలని కానీ అలాంటిదేమి చూపించలేదని జయరాణి చెబుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్టు భవానీ సోదరుడు గోపి చెబుతున్నారు.

శ్రీకాకుళం చీపురు పల్లిలో దాదాపు 15 ఏళ్ల కిందట భవానీ అదృశ్యమైంది. సోదరుడి వెంట స్కూల్‌కి వెళ్లి తప్పిపోయింది. ఆ తరువాత ఆమె కోసం ఎన్నో ఏళ్లుగా వెతికినా ప్రయోజనం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో పోలీసులకు ఈ విషయం కాస్త తలనొప్పిగా తయారైంది.

Related Story: ఇది సినిమా కథ కాదు: ఫేస్‌బుక్ సాయంతో కన్నవారి చెంతకు కూతురు