వేధిస్తున్నారని ఫిర్యాదుచేస్తే..‘డ్యాన్స్ చేస్తేనే కేసు పెడతా’నంటూ బాలికపై Si వేధింపులు

  • Publish Date - August 17, 2020 / 05:44 PM IST

కంచె చేను మేసినట్లుగా ఉంది యూపీలోని ఓ బాలిక పరిస్థితి చూస్తే. ఓ యువకుడు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు..నేను భరించలేకపోతున్నాను సార్..దయచేసిన నన్ను ఆ వేధింపుల నుంచి కాపాడండి సార్ అంటూ ఓ 16 ఏళ్ల బాలిక పోలీస్ స్టేషన్ కు వచ్చి తన గోడు చెప్పుకుంది. దయచేసిన నన్ను రక్షించండీ సార్ అని వేడుకుంది. కానీ ఆ పోలీసు తన బుద్ధి చూపించుకున్నాడు.



నువ్వు చెప్పిన కేసు నేను నమోదు చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి..నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అన్నాడు. ఏం చేయాలి సార్ అని అడిగింది ఆ అమ్మాయి..నువ్వు నా ముందు డ్యాన్స్ చేయాలి అలా చేస్తేనే నువ్వు చెప్పిన ఫిర్యాదు తీసుకుంటానన్నాడు. దానికి పాపం ఆ అమాయకురాలు అదేంటి సార్…అంటూ ప్రశ్నించింది. ఈఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అయింది.



సదరు బాధిత బాలిక తన కుటుంబంతో కలసి గోవింద్ నగర్‌లోని దబౌలి వెస్ట్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆ ఇంటి యజమాని మేనల్లుడు అనుప్ యాదవ్ ఆమెతో తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతడిపై కేసు పెట్టటానికి తన తల్లితో కలసి గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లంది. తన గోడు వెళ్లబోసుకోగా సదరు స్టేషన్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్.. నువ్వు నా ముందు నిలబడి చక్కగా డ్యాన్స్ చేస్తేనే కేసు నమోదు చేస్తానంటూ కండీషన్ పెట్టాడని ఆమె వాపోయింది. ఓ సారి అతను మాపై దాడి చేశాడని బాలిక తల్లి వాపోయింది.



బాధితుల వెర్షన్ ఇలా ఉంటే పోలీసులు మాత్రం అద్దె ఇంటి విషయంలో బాలిక కుటుంబానికి ఇంటి యజమానికి మధ్య వివాదం నడుస్తోందని గోవింద్ నగర్ సర్కిల్ ఇన్‌స్ఫెక్టర్ అంటున్నాడు.