బురదలో కూరుకుపోయిందా..ఆమెకోసం అంగుళం కూడా వదలకుండా గాలింపు

  • Publish Date - August 18, 2020 / 01:53 PM IST

ఉత్తరాఖండ్ లో తరచూ ప్రకృతి ఏదో ఒక విలయం సృష్టిస్తుంటుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పితోర్ జిల్లా థార్చుల ప్రాంతంలో విరగిపడ్డ కొండ చరియలల్లో ఓ మహిళ గల్లంతైంది. వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. కాగా గల్లంతు అయిన మహిళ ఆ బురదలో కూరుకుపోయిందేమోనని అధికారులు భావిస్తున్నారు. దీంతో గల్లంతు అయిన మహిళ కోసం ఉత్తరాఖండ్ కొండచరియలు: పిథోరాగ h ్ జిల్లాలో తప్పిపోయిన మహిళ కోసం శోధిస్తున్నారు.



వివరాల్లోకి వెళితే..నర్ సింగ్ అనే 32 ఏళ్ల మహిళ సోమవారం (ఆగస్టు 17,2020) ఆఫీసుకని బయలుదేరింది. కానీ ఆమె తిరిగి రాలేదు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో థార్చుల వద్ద విరిగిపడ్డ కొండచరియల్లో ఆమె గల్లంతైంది. దీంతో ఆమె కోసం ఎస్ డీఆర్ ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మూడు కిలోమీటర్ల నడుస్తూ..ప్రమాదం జరిగిందని భావిస్తున్న మహిళ కోసం బురదలో అంగుళం అంగుళం గాలిస్తున్నారు.