ధర్మం.. అధర్మం మధ్య పోటీ : విజయమ్మ

టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలతో వైసీపీ అధినేత జగన్..లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని సీఎం బాబు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖండించారు.

  • Publish Date - April 2, 2019 / 08:16 AM IST

టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలతో వైసీపీ అధినేత జగన్..లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని సీఎం బాబు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖండించారు.

టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలతో వైసీపీ అధినేత జగన్..లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని సీఎం బాబు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖండించారు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని స్పష్టం చేశారు. ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్లలో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీలపై విమర్శలు చేశారు. 
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష

హోదా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు మోసం చేశాయని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ‘హోదా’ ఇస్తేనే మద్దతిస్తామని జగన్ ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు విజయమ్మ. బిజెపి..కేసీఆర్ లతో ఒప్పందం చేసుకోలేదు..కాంగ్రెస్ తో కూడా ఎలాంటి సంబంధం లేదని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. 

చంద్రబాబు పాలనపై కూడా విజయమ్మ విమర్శలు చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. న్యాయానికి అన్యాయానికి..ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. టీడీపీ పాలనలో అన్యాయం.. అబద్దం.. అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇసుక, మట్టి, బొగ్గు, రాజధాని భూములు..ఇలా ప్రతొక్కటి అమ్ముకుంటున్నారని.. ప్రజలు మేల్కోవాలని విజయమ్మ సూచించారు. 
Read Also : మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ : బుద్ధా..నోరు ఉంది కదా అని పారేసుకోకండి