అంపైర్.. కాస్త కళ్లు తెరువు.. ఇది ఐపీఎల్ : కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బాల్ వివాదాస్పదంగా మారింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బాల్ వివాదాస్పదంగా మారింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బాల్ వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ప్రత్యర్థి జట్టు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిప్పులు చెరిగాడు. 20వ ఓవర్ బౌలింగ్ వేసిన లసిత్ మలింగ లైన్ దాటి ఒక అంగుళం లోపలకి కాలు పెట్టి బాల్ విసిరాడు.
Read Also : సిక్సు కొట్టా.. నా కండలు చూడండి : హార్దిక్ పాండ్యా

సాధారణంగా మ్యాచ్‌లో జరిగే ప్రతి విషయానికి స్పందించే కోహ్లీ.. ఆఖరి బంతిని నో బాల్ ప్రకటించాల్సింది పోయి పట్టించుకోకుండా వదిలేసిన అంపైర్ ఎస్ రవిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ‘మనం ఐపీఎల్ స్థాయిలో ఆడుతున్నాం. ఇది క్లబ్ క్రికెట్ కాదు. నిర్లక్ష్యంతో ఉండకండి. కాస్త కళ్లు తెరుచుకుని ఉండాలి. అంగుళం బయటికి బాల్ విసిరినట్లు కనిపిస్తోంది. కచ్చితంగా అది నో బాల్. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్లే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు’ అని కోహ్లీ మ్యాచ్ అనంతరం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

ఒకవేళ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించి ఉంటే బెంగళూరు జట్టు టార్గెట్ దూరం 5 పరుగులకు తగ్గేది. వచ్చిన ఆ ఫ్రీ హిట్‌ను సరిగ్గా వాడుకుంటే మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు. అప్పటికే ఫామ్‌లో ఉన్న డివిలియర్స్ ఒక్క సిక్స్‌తో మ్యాచ్ మార్చేయగలడు. ఆ అంపైర్ నిర్లక్ష్యం కారణంగా బెంగళూరు మ్యాచ్‌ను 6పరుగుల తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. 
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష