ఓటర్ల లిస్టు రెడీ : ఏపీలో తొలగించిన ఓట్లు 1 లక్ష 41 వేల 822 

  • Publish Date - March 23, 2019 / 03:42 AM IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా  ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లికేషన్లు రాగా వాటిలో కేవలం 1.41 లక్షల ఓట్లు మాత్రమే తొలగించటానికి వీలున్నట్లు పేర్కొన్నారు. మిగిలినవన్నీ బోగస్ అప్లికేషన్లని ఎన్నికల సంఘం తేల్చింది. 
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 35వేల 603 ఓట్లు తొలగించగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2,579 ఓట్లు తొలగించారు.  తొలగించిన ఓట్లలో మరణించిన వారి ఓట్లు 68,422 కాగా, రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన ఉన్న 64,083 మంది ఓట్లు కూడా తొలగించారు. 9 నియోజక వర్గాల్లో ఐతే తొలగించిన ఓట్ల సంఖ్య 10 లోపే ఉంది. నియోజక వర్గాల వారీగా  చూస్తే నందిగామలో అత్యధికంగా 4,748 ఓట్లు తొలగించారు. ఆ తర్వాతి వాటిలో రేపల్లెలో 4425 ఓట్లు, మాచర్లలో 3538, వేమూరులో 3480, ధర్మవరంలో 3180 ఓట్లు, జగ్గయ్యపేటలో 3111, మంగళగిరిలో 3066 ఓట్లు తొలగించారు. కాగా నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో ఒక్క ఓటు కూడా తొలగించకపోవటం విశేషం.

ఏపీలో జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2019 మార్చి 21 నాటికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా  ప్రకారం 3 కోట్ల 89 లక్షల  08 వేల 016 మంది ఓటర్లు ఉన్నట్లు  లెక్కతేల్చింది. ఈ తుది జాబితాకు ముందు  3,69,33,091 మంది ఓటర్లు ఉండగా……. కొత్తగా పేర్లు నోమదు చేసుకున్న 21 లక్షల16 వేల 747 మందికి కూడా ఓటు హబక్కు కల్పించినట్లు  ఎన్నికల సంఘం విడుదల చేసిన  ప్రకటలో తెలిపారు.
Read Also : ఎన్నికలకు మరో ఇరవై రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ