తూర్పుగోదావరి జిల్లాల్లో పడవ మునకతో వరంగల్ అర్బన్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బోటులో మొత్తం 62 మంది ఉన్నారు. అందులో 24 మందిని NDRF రక్షించింది.
వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు కూడా ఉన్నారు. మహారాజు కాలనీ వాసులు విహార యాత్రకు వెళ్లారు. ఘటన జరిగిన అనంతరం తీవ్ర భయాందోళనలకు గురయ్యామని గ్రామానికి చెందిన వారు 10tvకి తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న అనంతరం తాము ఫోన్లు చేస్తుంటే..స్విచాఫ్ వస్తోందన్నారు. ఎవరూ టచ్‌లోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా నుంచి మొత్తం 14 మంది రావడం జరిగిందని వరంగల్ జిల్లాకు చెందని ఓ వ్యక్తి తెలిపాడు. బోటు ఒక్కసారిగా బోల్తా కొట్టిందని, ఆ సమయంలో కొందరు నీళ్లలో దుంకారని పేర్కొన్నారు. అనంతరం బోటు పై భాగంలో ఎక్కినట్లు..ఈ సమయంలో ఓ బోటు రావడంతో సురక్షితంగా బయటపడ్డామన్నారు. 5 మంది మాత్రమే సురక్షితంగా ఉన్నామని, మిగతా వారి ఆచూకి తెలియడం లేదని వాపోయారు.
Read More : గోదావరిలో ఘోరం : బోటు ప్రమాదంపై కఠిన చర్యలు –