‘Waste to Energy’ : చెత్త నుంచి కరెంట్ తయారీకి ప్రభుత్వం శ్రీకారం

  • Publish Date - July 16, 2020 / 05:54 PM IST

‘Waste to Energy’: మనస్సుంటే మార్గం లేకపోదు అనేది పెద్దలు చెప్పిన మాట..ఆలోచన ఉండాలే గానీ చెత్తను కూడా మనిషి చక్కగా ఉపయోగించుకోవచ్చని నిరూపిస్తోంది ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం. వ్యర్థాలను విద్యుత్‌గా మార్చేందుకు ప్లాన్ వేస్తోంది. దానికి ‘వేస్ట్ టు ఎనర్జీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి మదన్ కౌశిక్ తెలిపారు. దీనికి సంబంధించి ముసాయిదాను కూడా తయారు చేశామని దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు.

ప్రకృతికి ఆలవాలమైన ఉత్తరాఖండ్ రాష్ట్రం వ్యాప్తంగా ప్రకలెక్కల ప్రకారం ప్రతి రోజు 900 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తంలో సగం సేంద్రియ స్వభావం కలిగి ఉండగా..17శాతం శాతం రీసైకిల్‌ కేటగిరిలోకి, 21శాతం బయోమెడికల్‌, 11శాతం ఇన్నర్‌ నేచర్‌ (భవన నిర్మాణ మెటీరియల్‌) వ్యర్థాలున్నాయి.

ఉత్తరాఖండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (యూఈపీసీబీ) అంచనా ప్రకారం ఈ వ్యర్థాలతో 5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, తద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని భావిస్తోంది. 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో 10 కొండ ప్రాంతాలుండగా..అంతటా ఘన వ్యర్థాలను డంప్‌ చేసేందుకు పల్లపు ప్రాంతం సమస్యను పరిష్కరించడం కూడా ఈ పథకం లక్ష్యం. గత జూన్ నెలలో యూఈపీపీసీబీ రాబోయే కాలంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ఇంధన విధానాన్ని ఆమోదించింది.

దీంట్లో కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్‌ కోక్‌ ఇంధనంగా ఉపయోగించడంపై నిషేధం ఉన్నది. ఇది వాయు కాలుష్యంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. జూన్ రెండో వారంలో సమావేశం జరుగగా..రాష్ట్రంలో పెట్రోలియం కోక్ మరియు ఫర్నేస్ ఆయిల్‌ను ఇంధనంగా ఉపయోగించడాన్ని నిషేధించడానికి 2024 మార్చి నాటికి గడువు విధించారు. పెట్రోలియం కోక్ అనేది ఒక తుది ఘన ఉప ఉత్పత్తి, ఇది ఆయిల్ రిఫైనింగ్ ప్రక్రియ నుంచి ఉత్పన్నం అవుతుంది. ఇందులో కార్బన్‌ ఎక్కువగా ఉండడంతో మరింత కాలుష్యం, గ్రీన్‌హౌస్‌ వాయువులను విడుదల చేస్తుంది.

గత జనవరిలో డెహ్రాడూన్ నగరం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకంటే దానికంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ కలుషితమైంది. కాన్పూర్ కంటే అధ్వాన్నంగా ఉందని గ్రీన్ పీస్ నివేదిక పేర్కొంది. గాలిలో పీఎం 10 స్థాయిల ఆధారంగా ‘ఎయిర్ పోకాలిప్స్ 4’ పేరుతో నివేదిక 2020 జనవరి 23న విడుదలైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి మదన్‌ కౌశిక్‌ మాట్లాడుతూ కార్యక్రమంపై పాలసీపై ముసాయిదా సిద్ధంగా చెప్పారు. సీఎం కార్యాచరణ నిర్ణయించడానికి సమావేశం త్వరలో నిర్వహిస్తారని తెలిపారు.