Asia Cup-2022: ఆసియా కప్‌ ఫైనల్ మ్యాచులో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్-శ్రీలంక తలబడుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భానుక రాజపక్స 54 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, భానుక రాజపక్స బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి ప్యాడ్లకు తగిలినట్లు అనిపించడంతో పాకిస్థాన్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసింది. అది నాటౌట్ గా తేలింది. ఆ సమయంలో అంపైర్ వద్దకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాడు హరీస్ రవూఫ్.. సరదాగా అంపైర్ చేతిని పైకి లేపుతూ ఔట్ ఇస్తున్నట్లు చేశాడు. దీంతో అంపైర్ కూడా నవ్వుకున్నారు.

Asia Cup-2022: ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్-శ్రీలంక తలబడుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భానుక రాజపక్స 54 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, భానుక రాజపక్స బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి ప్యాడ్లకు తగిలినట్లు అనిపించడంతో పాకిస్థాన్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసింది. అది నాటౌట్ గా తేలింది. ఆ సమయంలో అంపైర్ వద్దకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాడు హరీస్ రవూఫ్.. సరదాగా అంపైర్ చేతిని పైకి లేపుతూ ఔట్ ఇస్తున్నట్లు ప్రవర్తించాడు. దీంతో అంపైర్ కూడా నవ్వుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, భానుక రాజపక్స నిన్నటి మ్యాచులో 71 పరుగులు చేయడంతో శ్రీలంక 170/6 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో పాక్ ఏ మాత్రం రాణించలేకపోయింది. పాక్ 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయడంతో శ్రీలంక ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆసియా కప్ ఆడిన శ్రీలంక కప్ గెలుచుకోవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Ganesh Laddu: వేలంలో గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికిన వైనం

ట్రెండింగ్ వార్తలు