రిపబ్లిక్ డే 2019 విశేషాలు

 • Publish Date - January 23, 2019 / 10:51 AM IST

ఢిల్లీ : జనవరి 26, రిపబ్లిక్ డే…ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా రానున్నారు. వివిధ రాష్ట్రాల శకటాలు రెడీ అవుతున్నాయి. రిహార్సల్స్ కూడా మొదలెట్టేశారు. మరి ఈసారి విశేషాలెంటో చూద్దామా

 • జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఘనంగా జరుగనున్నాయి. గాంధీని స్మరిస్తూ..ఆయన జీవితాన్ని ప్రతిబించేలా శకటాలు తయారు చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. 
 • జనవరి 23వ తేదీన బుధవారం రాజ్ పథ్ వద్ద రిహార్సల్స్ జరుగనున్నాయి. విజయ్ చౌక్ వద్ద ఉదయం 9.50కి ఇవి జరిగాయి. జనవరి 22 వ తేదీ ఉదయం 6గంటల నుండి రాజ్‌పథ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 • ఇండియా గేట్ జనవరి 23వ తేదీన ఉదయం 9గంటలకు క్లోజ్ చేయనున్నారు. 
 • రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలు జరిగే ప్రాంతంలో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
 • రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘నేషనల్ వార్ మెమోరీయల్’ను ఆవిష్కరించనున్నారు. దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ల సేవలను స్మరించుకోవాలని దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఏఎఫ్ మూడు హెలికాప్టర్‌లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 
 • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బయో ఇంధనంతో ఉన్న విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టనున్నాయి. రాజ్ పథ్‌లో ‘వి’ ఆకారంలో విమానాలు తిరగనున్నాయి. 
 • ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో మిలటరీకి చెందిన వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కే9 వజ్రతో పాటు T-90 ట్యాంక్స్, SU-30, Mig 29 హైలెట్‌గా ఉండనున్నాయి. 
 • ఐఏఎఫ్ కూడా ఈ సంవత్సరం ప్రత్యేక శకటాన్ని తయారు చేసింది. మొట్టమొదటగా మహిళా ఆఫీసర్ ఆర్మీ సర్వీసెస్ ప్రాతినిధ్యం వహించనున్నారు. డేర్ డెవిల్స్ మోటార్ సైకిల్ టీం కూడా పాల్గొననుంది. 
 • రాజ్ పథ్ వద్ద జిరగే పరేడ్‌లో జాతీయ ధైర్య సాహసాలు అవార్డులు పొందిన వారు కూడా పాల్గొనున్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ పొందిన గ్రహీత కూడా పాల్గొనున్నారు. 
 • రిపబ్లిక్ 2019 పరేడ్ టికెట్స్ జనవరి 7వ తేదీ నుండి విక్రయిస్తున్నారు. ఈ టికెట్లు జనవరి 25 వరకు విక్రయించనున్నారు. బీటింగ్ రీట్రిట్‌కు సంబంధించిన టికెట్లను జనవరి 27-28వ తేదీల్లో విక్రయించనున్నారు. 
   

ట్రెండింగ్ వార్తలు