ఢిల్లీ : రిపబ్లిక్ 2019 వేడుకులకు రాష్ట్రాలు సన్నద్ధమౌతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు ఆయా గ్రౌండ్స్‌లలో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. అంతేగాకుండా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో క్లుప్లంగా…
- ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1500 మంది ఖైదీలను విడుదల చేయనుంది. వీరు వివిధ అనారోగ్యాలతో బాధ పడుతున్నారు.
- 26 జనవరిన జమ్మూ కాశ్మర్ పోలిసులు 41 మోటార్ సైకిళ్లతో విన్యాసాలు చేయనున్నారు. 31 మంది సభ్యులతో డేర్ డెవిల్స్ టీం కూడా విన్యాసాలు చేయనుంది.
- జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని వెస్ట్ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు ఆయన్ను స్మరించుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
- రాజ్ పథ్‌లో జరిగే వేడుకల్లో పంజాబ్ శకటం పాల్గొననుంది. జలియన్ వాలాబాగ్ నేపథ్యంలో శకటం తయారు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహాలో శకటం తయారు చేసింది.
- ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘అనాసక్తి ఆశ్రమం’ పేరిట శకటం తయారు చేసింది. రాజ్ పథ్ వద్ద జరిగే పరేడ్‌లో ఈ శకటం పాల్గొననుంది.
- బీహార్ రాష్ట్రంలో రిపబ్లక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 16 డిపార్ట్జమెంట్‌లకు చెందని శకటాలు పాల్గొనున్నాయి.
- బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని లాల్ బాగ్‌లో ఫ్లవర్ షో జరుగనుంది. మొత్తం 7 లక్షల పుష్పాలతో షో ఉండనుంది.