కామారెడ్డి జిల్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడిపి ఓ మహిళ ప్రాణాలు తీశాడు.
కామారెడ్డి జిల్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడిపి ఓ మహిళ ప్రాణాలు తీశాడు. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును యాజమాన్యం.. తాత్కాలిక డ్రైవర్ నరేష్‌కు అప్పగించింది.
అయితే నరేష్ పీకలదాకా మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడు. ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర సిగ్నల్ క్రాస్ చేస్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అనంతరం ఆమె పైనుంచే బస్సును తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు తాత్కాలిక డ్రైవర్ నరేష్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
అక్టోబర్ 5 వ తేదీ నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లతో కొన్ని ప్రైవేట్ బస్సులను నడిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అద్దె బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్స్ బస్సులు నడిపి ప్రమాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు.