జగన్ – కేటీఆర్ భేటీ : టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు – అంబటి…

  • Publish Date - January 16, 2019 / 10:57 AM IST

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలపై టీడీపీ నేతలు శోకాలు ఎందుకు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రయోజనాలు..హక్కుల పరిరక్షణ కోసం ఇరు పార్టీలు చర్చిస్తుంటే…ఏదేదో వాగుడు వాగుతున్నారని..ఇది సబబు కాదన్నారు. తాము పొత్తుల కోసం చర్చలు చేయడం లేదని స్పష్టం చేశారు. 
జనవరి 16వ తేదీ బుధవారం కేటీఆర్ – జగన్ భేటీ అనంతరం ఏపీ టీడీపీ పలు విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ….రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకొనేందుకు..కేంద్రంపై వత్తిడి పెంచేందుకు జాతీయ వేదిక ఏర్పాటు చేద్దామనే భావన కేసీఆర్‌లో కలిగిందని..దేశంలోని జాతీయ పార్టీల నేతలను కలిశారని గుర్తు చేశారు. అందులో భాగంగా జగన్‌ను కేటీఆర్ బృందం కలిసిందన్నారు. హోదాకు ఫెడరల్ ఫ్రంట్ సహకరిస్తుందా ? లేదా ? అనే డౌట్‌కు కేటీఆర్…స్పష్టమైన వైఖరి వెల్లడించడం…ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వాగతిస్తే తప్పా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని..ఏపీలో 175 సీట్లకు ధైర్యంగా పోటీ చేసే దమ్ము..ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఉందని అంబటి వెల్లడించారు. 

ట్రెండింగ్ వార్తలు