వల్లభనేని వంశీ ఇంటికి వచ్చాడు.. బెదరిస్తున్నాడు: వైసీపీ అభ్యర్ధి

  • Publish Date - May 2, 2019 / 01:27 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో వంశీ తన ఇంటికి వచ్చి వెళ్లాడంటూ ఫిర్యాదు చేశారు యార్లగడ్డ వెంకట్రావు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్‌‌లో వంశీ వచ్చిన దృశ్యాలను చూడాలని వెంకట్రావు కోరారు.

వారం రోజుల క్రితం తనకు ఫోన్‌ చేసి బెదిరించాడని మౌకికంగా ఫిర్యాదు చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. తనకు సన్మానం చేసేందుకు ఇంటికి వస్తానని, ఫోన్‌చేసి బెదిరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంధర్భంగా తనకు రక్షణ కల్పించేందుకు గన్‌మెన్లను కేటాయించాలని వెంకట్రావు కమీషనర్‌ను కోరారు. 
Also Read : కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం