సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ రోజున మీరు కూడా మోడీతో కలిసి వేడుకులు జరుపుకోవాలని భావిస్తున్నారా? అయితే.. సోషల్ మీడియా వేదికగా మోడీకి బర్త్ డే విషెస్ తెలపవచ్చు. అందుకు మీరు చేయాల్సింది ఒకటే.. మీ ఫోన్ లోని వాట్సాప్ ద్వారా మోడీకి శుభాకాంక్షలు చెప్పవచ్చు. మోడీ థిమ్ వాట్సాప్ స్టిక్కర్లు వచ్చేశాయ్.
ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ స్టిక్కర్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్స్ లో మీకు నచ్చిన ఏ యాప్ అయినా డౌన్ లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరికైనా పంపుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
* ప్లే స్టోర్‌లో.. నరేంద్ర మోడీ వాట్సాప్ స్టిక్కర్లు లేదా మోడీ వాట్సాప్ స్టిక్కర్లు అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
* మీ ఫోన్ స్ర్కిన్ పై యాప్స్ పాప్ అప్ లిస్ట్ వస్తుంది.
* మీకు నచ్చిన యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి.
* ఇన్ స్టాల్ చేసిన యాప్ ఓపెన్ చేసి స్టిక్కర్లను సెలక్ట్ చేయండి.
* ముందుగా (+) ఐకాన్ ట్యాప్ చేయండి.
* Add to వాట్సాప్ అని ప్రమోట్ చేసి.. Yes బటన్ నొక్కండి.
* మీ వాట్సాప్ చాట్ బాక్సు ఓపెన్ చేసి.. మోడీ స్టిక్కర్లను పంపుకోవచ్చు.