6 నెల‌ల్లో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన : జగన్

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో ప్లాంట్ పూర్తి చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీనిచ్చారు.

  • Publish Date - April 5, 2019 / 09:13 AM IST

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో ప్లాంట్ పూర్తి చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీనిచ్చారు.

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో ప్లాంట్ పూర్తి చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీనిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో వచ్చిన ఈ ప్లాంట్‌ను బాబు పాలనలో నాశనమైందన్నారు జగన్. కడప జిల్లా జమ్మలమడుగులో ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలుగాలని తెలిపిన జగన్..ఒక నిమిషం మౌనం పాటించారు. 
Read Also : అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్

గత మూడు సంవత్సరాలుగా శనగపంటకు గిట్టుబాటు ధర లేక రైతులు పలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. గౌడోన్‌లలో మొత్తం మూలుగుతున్న శనగపంటకు 6 వేల 500 ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. గండికోట బాధితులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రాజౌలి రిజర్వాయర్ గురించి ఎవరూ ఆలోచించలేదని విమర్శించారు.

చేనేత కార్మికులకు నూలు సబ్సిడీ రావడం లేదు..చేనేతలకు బాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా ? అని ప్రశ్నించారు. నవరత్నాల్లో పేర్కొన్న సౌకర్యాలే కాక…ప్రతి మగ్గం ఉన్న ప్రతొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ. 24వేలు ఇస్తానని ప్రకటించారు జగన్. అగ్రిగోల్డ్ ఆస్తులను గద్దలా తీసుకొనేలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన జగన్…తాము మాత్రం బాధితుల కోసం రూ. 1150 కోట్లను మొట్టమొదటి బడ్జెట్‌లో పెట్టడం జరుగుతుందన్నారు. దీనివల్ల 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే మేలు జరుగుతుందన్నారు. కేశవరెడ్డి బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని..కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డిని ఎలా మంత్రి చేశారని సూటిగా ప్రశ్నించారు. ధర్మం..అధర్మం మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ వెల్లడించారు. 
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్