కుప్పంలో జగన్ : ఆస్థిని కాజేసిన బాబు

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జగన్..సీఎం బాబు సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు.

  • Publish Date - April 5, 2019 / 12:50 PM IST

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జగన్..సీఎం బాబు సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు.

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జగన్..సీఎం బాబు సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్..బాబుపై పలు ఆరోపణలు..విమర్శలు చేశారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బాబు అని..తల్లిపేరిట ఉన్న ఆస్తిని కుటుంబసభ్యులకు పంచకుండా కొడుకు లోకేష్ పేరిట రాశాడాని ఆరోపించారు. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం జగన్ కుప్పంలో రోడ్ షో నిర్వహించారు. 
Read Also : ఉగాది అంటే ఏమిటి.. ఏలా జరుపుకోవాలి?

హైదరాబాద్‌లో 5 ఎకరాలు, జూబ్లిహిల్స్‌లో ఒక ఇల్లు..వీటిని తమ్ముళ్లకు, చెళ్లెళ్లకు ఇవ్వకుండా కొడుకు నారా లోకేష్‌కి బాబు రాసిచ్చాడని జగన్ ఆరోపించారు. ఇలాంటి బాబు..ఏపీ ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పడం పచ్చి మోసమన్నారు జగన్. బాబు పాలనలో కుప్పం నియోజకవర్గం అథోగతి పాలైందని విమర్శించారు. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబు..సాగు, తాగు నీరందించలేదన్నారు.

కుప్పం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని..దీనికి బాబే కారణమన్నారు. కుప్పంలో ప్రైవేటు మార్కెట్ యార్డు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. ఇక్కడ నిరక్ష రాస్యత ఇక్కడ తాండవిస్తోందని, రాష్ట్రంలో సగటు అక్షరాస్యత 67 శాతం ఉంటే..కుప్పంలో 62 శాతం అక్షరాస్యత లేదని జగన్ తెలిపారు. 
Read Also : బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి