ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారని ప్రతిపక్ష నేత, సీఎం అభ్యర్థి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. లోటస్ పాండ్ వేదికగా జగన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన ఓటమి తప్పదని నిర్దారణకు వచ్చి ప్రజలను ప్రలోభాలను పరిచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎలాగైనా గెలవాలని రకరకాల కుయుక్తుల పన్ని దాడులకు కూడా పాల్పడ్డారన్నారు. ఏప్రిల్ 11 ఉదయం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యం కాపాడేందుకు బాధ్యతకు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ సృష్టించిన అల్లర్లకు.. అగయిత్యాలకు నిలబడి ఆటుపోటులకు ఎదుర్కొని పోరాడిన వ్యక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వారు చేసిన అఘాయిత్యాలకు వైఎస్సార్సీపీకి చెందిన బలైపోయిన ఇద్దరి వ్యక్తుల కుటుంబాలకు తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాంతాల వారీగా వైసీపీకి చెందిన ప్రజలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో పుల్లారెడ్డి.. విజయనగరం జియమ్మవలస మండలంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీ అనే మహిళపై దాడి.. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అనిల్ కుమార్ పై దాడి.. గుంటూరు కాసు మహేశ్ రెడ్డి.. నరసరావుపేట ఎమ్మెల్యే కారుపై దాడి.. మరో నేత ఎమ్మెస్ బాబుపై దాడి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాటి పుల్లారావు భార్య వార్నింగ్…గుంటూరు వేమూరు మండలం వైఎస్సార్సీపీ కార్యకర్త నాగార్జునపై దాడి..ల గురించి చెప్తూ చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.
ఇవన్నీ చాలదన్నట్లు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ.. మంగళగిరి టీడీపీ అభ్యర్థి అయిన లోకేశ్ పది మంది అనుచరులతో ప్రతి బూత్ లో తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తిట్టిపోశారు.
చివరిగా ‘దేవుని దయ వల్ల 80శాతానికి పైగా ప్రజలు ఓటు వేయడం హర్షించదగ్గ విషయం. పేరుపేరునా అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది ప్రజల విజయంగా చెబుతున్నా’ అని ముగించారు.