జగన్ విజయయాత్ర : జనం పోటెత్తుతున్నారు

  • Publish Date - January 9, 2019 / 10:27 AM IST

శ్రీకాకుళం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపుకు చేరుకుంది. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. పాదయాత్ర గుర్తు ఉండేలా విజయస్థూపాన్ని జనవరి 09వ తేదీన జగన్ ఆవిష్కరించారు. పైలాన్‌ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగసభా స్థలికి పాదయాత్ర వెళ్లారు జగన్. జగన్ చూసేందుకు…కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. 
ఇచ్చాపురం జనసంద్రం…
పాతబస్టాండు వద్ద భారీ బహిరంగసభ జరుగుతోంది. సభకు జనాలు పోటెత్తుతున్నారు. భారీగా జనాలు తరలివస్తుండడంతో
ఇచ్చాపురం కిటకిటలాడుతోంది. జై జగన్..జై జై జగన్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ పాదయాత్ర బహిరంగసభలో సినీ నటులు కూడా పాల్గొంటున్నారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందని…వైఎస్సార్‌ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
మొత్తం పాదయాత్ర జరిగిన రోజులు: 341.
పాదయాత్ర సాగిన నియోజకవర్గాలు: 134.
పాదయాత్ర సాగిన మొత్తం గ్రామాలు: 2,516.
పాదయాత్ర సాగిన మండలాలు: 231.
పాదయాత్ర సాగిన మున్సిపాలిటీలు: 54.
పాదయాత్ర సాగిన కార్పొరేషన్లు: 8.
ఆత్మీయ సమ్మేళనాలు: 55.
బహిరంగ సభలు: 124.

ట్రెండింగ్ వార్తలు