ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట ఓ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బుక్‌ని విడుదల చేసింది. బాబు ఎంత అవనీతి చేశాడో…రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారో బుక్‌లో వివరించడం జరిగిందని జగన్ వివరించారు.
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట ఓ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బుక్‌ని విడుదల చేసింది. బాబు ఎంత అవనీతి చేశాడో…రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారో బుక్‌లో వివరించడం జరిగిందని జగన్ వివరించారు. నాలుగున్నరేళ్లుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దర్యాప్తు సంస్థలకు అందిస్తామని జగన్ వెల్లడించారు.
సిక్కోలులో బుక్ రిలీజ్…
జనవరి 06వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం లక్కవరం పాదయాత్రలో జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ…నాలుగున్నరేళ్ల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పేర్కొన్న జగన్…బాబు ఎలాంటి పనులు చేపట్టారు..ఏ జీవోలు విడుదల చేశారో ఆధారాలతో సహా పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. చంద్రబాబు దారుణంగా రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
వైసీపీకి లాభం జరుగుతుందా ?
ఇప్పటి వరకు ప్రతిపక్ష..అధికారపక్ష మధ్య మాటలకే పరిమితమైన ఆరోపణలు..విమర్శలు..ఇక బుక్‌లకు విస్తరించాయి. బాబు ఎంత అవినీతి చేశాడో తెలుసా ? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏకంగా అవినీతి చక్రవర్తి పేరిట బుక్ రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. బాబు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి క్యాష్ చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా రూ. 2 లక్షల కోట్లు అవినీతి జరిగిందంటూ….ఇందుకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని వైసీపీ చెబుతోంది. ఈ బుక్‌లను చదివిన వారు ప్రభుత్వాన్ని ఈసడించుకుంటారని..ఫలితంగా వైసీపీకి లాభం జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మరి…బుక్‌లో పేర్కొన్న ఆరోపణలు తప్పని తెలుగు తమ్ముళ్లు నిరూపిస్తారా ? లేక మాటలకు పరిమితమవుతారా ? జగన్ ఎంత అవినీతి చేశాడో తెలుసా ? అంటూ ప్రతిగా బుక్ రిలీజ్ చేస్తారా ? అనేది చూడాలి.