అబ్దుల్‌కలాం పేరు మారుస్తారా? : సీఎం జగన్ సీరియస్

  • Publish Date - November 5, 2019 / 06:24 AM IST

మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌కలాం పేరిట ప్రతి ఏటా పదవ తరగతి ప్రతిభావంతులకు ఇచ్చే అబ్దుల్‌ కలాం అవార్డుల పేరు మార్చాలని తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అబ్దుల్‌ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్‌ఆర్‌ పేరిట అందించేందుకు జారీ అయిన ఉత్తర్వులపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిభా పురస్కారాల పేరు మార్పును తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిభా పురస్కారాలకు  యథాతథంగా అబ్దుల్‌కలాం పేరునే పెట్టాలని సూచించారు జగన్. 

అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మిగిలిన మహానీయులు పేర్లు కూడా పెట్టాలని అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్‌ పూలే, అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల పేర్లతో విద్యార్ధులకు అవార్డులు ఇవ్వాలని సూచించారు.