ప్రచారానికి విరామం ప్రకటించిన వైఎస్ జగన్

  • Publish Date - April 2, 2019 / 01:28 AM IST

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు విరామం ప్రకటించారు. మంగళవారం(2 ఏప్రిల్ 2019) ఎన్నికల ప్రచారానికి విరామం ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల గడవు ముంచుకొస్తున్న తరుణంలో ఎన్నికలకు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాల గురించి పార్టీ ముఖ్య నేతలతో చర్చించేందుకు వైసీపీ అధినేత విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఏప్రిల్ 3వ తేదీ తిరిగి జగన్ ఎన్నికల ప్రచారంను కొనసాగించనున్నారు. బుధవారం గుంటూరు జిల్లా,  ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాల ప్రచారంలో జగన్ పాల్గొంటారు.  గుంటూరు జిల్లాలో ఉదయం 9.30 గంటలకు సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు.