వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

ఉగాది పర్వదినం నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శనివారం(06 ఏప్రిల్ 2019) విడుదల చేశారు.

  • Publish Date - April 6, 2019 / 04:46 AM IST

ఉగాది పర్వదినం నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శనివారం(06 ఏప్రిల్ 2019) విడుదల చేశారు.

ఉగాది పర్వదినం నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శనివారం(06 ఏప్రిల్ 2019) విడుదల చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఉగాది పంచాంగ శ్రవణం తర్వాత జగన్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుగా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జగన్.. మేనిఫొస్టోను విడుదల చేశారు.
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో

ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలను ఇందులో పెట్టగా.. అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు జగన్ చెప్పారు. ఒక బుక్‌లెట్‌ను విడుదల చేయడం.. కులానికి ఒక పేజ్ పెట్టడం మేనిఫెస్టోలో పెట్టట్లేదని, చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో చెవిలో పెడుతారని, తాము అలా చేయట్లేదని చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో:

-రైతులకు సంబంధించి ప్రతీ రైతు కుటుంబానికి 50వేల రూపాయలు..
-పెట్టుబడి కోసం మే నెలలో 12500
-రైతులకు వడ్డి లేని రుణాలు.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ
-ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. వ్యవసాయ ట్రాక్టర్‌లకు ట్యాక్స్‌లు రద్దు

-పాడి రైతులకు లీటర్ పాల పై రూ. 4 సబ్సిడీ
-సహకార రంగం పునరుద్ధరణ
-ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 7లక్షలు వైయస్ఆర్ భీమా
-రైతులకు ఉచితంగా బోర్లు 
-భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతుకు వడ్డి లేని రుణాలు

-ఏడాదికి రూ.5లక్షలు ఆదాయం దాటని వారికి వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు.. 
– వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ప్రభుత్వమే కడుతుంది. 
-ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10వేల 
-హాస్పిటళ్ల దశాదిశా మార్పు.. ప్రభుత్వ డాక్టర్లు పెంపు

-పెన్షన్‌ల పెంపు.. రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతాం
-ఇళ్లు లేని పేదలు అందరికీ ఇళ్లు
-స్థలం లేనివాళ్లకు స్థలం ఇచ్చి ఇళ్లు ఇచ్చే రోజునే రిజిస్ట్రేషన్‌లు

-యువత, ఉపాధి
-హోదా సాదన ద్వారా ఉపాది.. గ్రామ సచివాలయం.. 
-నేలకు 5వేల గౌరవ వేతనంగా సేవకులు ఏర్పాటు.. సచివాలయంకు అనుసంధానం
-పథకాలు ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరి 

-చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు

-కాపు సంక్షేమం, కాపులకు రిజర్వేషన్‌లు
-బీసీ హక్కులకు బంగం కలగకుండా కాపు రిజర్వేషన్‌లకు మద్దతు
-కాపు కార్పోరేషన్‌కు ఏడాదికి 2వేల కోట్లు చొప్పున 5ఏళ్లకు రూ.10వేల కోట్లు

– జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం రూ.5వేలు

-అర్చకులకు జీతాలు పెంపు
-అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు.. 
-వక్ఫ్ బోర్డు ఏర్పాటు

-ముస్లీం మైనారిటీ మహిళల పెళ్లికి 1లక్ష
-ముస్లీం మైనారిటీలు ప్రమాదంలో మరణిస్తే వైఎస్‌ఆర్ బరోసా ద్వారా రూ.5లక్షలు
-క్రిస్టియన్‌ పాస్టర్లకు నెలకు రూ.5వేలు 

-అగ్రకులాల సంక్షేమంకోసం అన్నీ అగ్ర కులాలకు కార్పోరేషన్‌లు
-భూ సమగ్ర సర్వే
-ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేస్తాం
-పోలీసులకు వీక్లీ ఆఫ్
-జర్నలిస్ట్‌లకు ఆయా ప్రాంతాలలో ఇంటిస్థలాలు ఏర్పాటు
Read Also : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం