వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధుల ఫస్ట్‌లిస్ట్‌ని ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ నేత సురేష్ ప్రకటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైసీపీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. 16ఎంపీ స్థానాలకు, 175 ఎమ్మెల్యే స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధులు:
కడప-వైఎస్ అవినాష్ రెడ్డి
రాజంపేట-పీవీ మిథున్ రెడ్డి
చిత్తూరు-రెడ్డప్ప
తిరుపతి-బల్లి దుర్గాప్రసాద్
అనంతపురం-తళారి రంగయ్య
కర్నూలు- డా.సంజీవ్ కుమార్
నంద్యాల- బ్రహ్మానందరెడ్డి
హిందూపురం- గోరంట్ల మాధవ్
నెల్లూరు- ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఒంగోలు- మాగుంట శ్రీనివాస్ రెడ్డి
నరసరావుపేట- కృష్ణదేవరాయలు
విజయవాడ- పీ వరప్రసాద్
నరసాపూర్-రఘురాం కృష్ణం రాజు
బాపట్ల-నందిగం సురేశ్
మచిలీపట్నం-బాల శౌరి
గుంటూరు-మోదుగుల వేణుగోపాల్
కాకినాడ-వంగా గీత
అరకు- గొడ్డేటి మాధవి
ఏలూరు-కోటగిరి శ్రీధర్
రాజమండ్రి- మార్గాని భరత్
అమలాపురం-చింతా అనురాధ
అనకాపల్లి-కండ్రేగుల వెంకట సత్యవతి
విశాఖపట్నం-ఎంవీవీ సత్యనారాయణ
విజయనగరం-చంద్రశేఖర్
శ్రీకాకుళం-దువ్వాడ శ్రీనివాస్