YCP సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.
YCP సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాలను చుట్టేస్తుంటే.. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వింగ్.. ప్రభుత్వ లొసుగులు, పొరపాట్లను ప్రజల మైండ్‌లోకి ఇంజెక్ట్ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 10శాతం తమకు పడినా.. విజయానికి దోహద పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. ఏపీ రాష్ట్రంలో 4 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు వాడుకలో ఉన్నాయి. దాదాపు ప్రతొక్కరికీ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో ఏదో ఒకటి ఉంటోంది. కొంతమందికి అన్ని రకాల అకౌంట్లూ ఉన్నాయి. వారికి చేరువయ్యేందుకు వైసీపీ సోషల్ మీడియాను ఎంచుకుంది. అసలే ఎన్నికలకు టైం ఎక్కువ లేకపోవడంతో… సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది.
Read Also : లోకేష్ పప్పు..పప్పు : జయంతికి..వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల
పార్టీకి సంబంధించి 70 శాతం ప్రచారం సోషల్ మీడియా ద్వారానే చేస్తోంది. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్‌కు చెందిన IPAC సంస్థ సోషల్ మీడియా ప్రచార నిర్వహణను చూసుకుంటోంది. ప్రశాంత్ కిశోర్ తన అనుభవాన్ని రంగరిస్తూ సోషల్‌మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బాబు వైఫల్యాలను ఎండగడుతూ తటస్తులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. IPAC సభ్యులు… వైసీపీకి సంబంధించిన స్లోగన్‌లను ఐటీ నిపుణుల ద్వారా.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
నిన్ను నమ్మం బాబు, ఏపీ విత్ వైఎస్ఆర్‌సీపీ హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రచారాన్ని ఓ వైపు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. స్పీచ్ లోని హైలెట్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. యువత, విద్యావంతులే లక్ష్యంగా ఇందులో ప్రచారం చేస్తోంది. ఇన్నాళ్లూ ట్విట్టర్, ఫేస్‌బుక్ తో ప్రచారం చేసిన ఈ పార్టీ ఇప్పుడు వెబ్‌సైట్లలోను హల్ చల్ చేస్తోంది. గూగుల్ యాడ్స్‌లో వైసీపీ ప్రకటనలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కువ మందిని తమ వైపు ఆకర్షించేందుకు.. ఐటి, సోషల్‌మీడియా వింగ్‌ల ద్వారా భారీగా ఖర్చు చేస్తోంది.
అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి అన్ని అవకాశాలని వినియోగించుకొంటోంది వైసీపీ. టీడీపీ లొసుగులు, నేతలు చేసిన పొరపాట్లుని బూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో అధికార పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల విడుదలైన రావాలి జగన్.. కావాలి జగన్ పాట.. కొద్ది గంటల్లోనే 80లక్షల వ్యూస్ సంపాదించుకోవడం.. సోషల్ మీడియాలో వైసీపీకి ఉన్న ఫాలోయింగ్‌ను చెప్పకనే చెబుతోంది. ఈ ప్రచారంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ 3వ స్థానంలో ఉంది. ఆప్ మొదటి స్థానంలో నిలవగా.. సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఇక సోషల్ మీడియాలో ఖర్చులో వైసీపీ మొదటి స్థానంలో ఉండగా… టీడీపీ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు పార్టీలూ కలిసి… 70శాతం ఎన్నికల ఖర్చును సోషల్ మీడియాపైనే చేస్తుండటం విశేషం.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు