ఆంధ్రప్రదేశ్ లో రాజధానిసెగలు ఇంకా చల్లారలేదు..అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా నిలబడి వారితో కలిసి పోరాడుతున్నారు. అధికార వైసీపీ నాయకులు కూడా మాటలతో ప్రతిదాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయసాయి రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు.
అమరావతి రాజధానిపై మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
‘అమరావతి ప్రాంత నేల స్వభావం, భౌగోళిక స్థితిగతులు భారీ నిర్మాణాలకు అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కమిటీ నివేదికపై చంద్రబాబు హేళనగా మాట్లాడారు. వంద తరాలకు సరిపడా… రాజధాని రియల్ ఎస్టేట్ పైనే సంపాదించాలని స్కెచ్ వేశాడు. మూడు ప్రాంతాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
అమరావతి ప్రాంత నేల స్వభావం, భౌగోళిక స్థితిగతులు భారీ నిర్మాణాలకు అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కమిటీ నివేదికపై @ncbn హేళనగా మాట్లాడాడు. వంద తరాలకు సరిపడా రాజధాని రియల్ ఎస్టేట్ పైనే సంపాదించాలని స్కెచ్ వేశాడు. మూడు ప్రాంతాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 6, 2020