Girl fight with boys in restaurant : ఆడపిల్లల (girl) రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి ఏం చేయలేకపోతున్నాయి. ఎక్కడో అక్కడ వారికి అన్యాయం జరుగుతోంది. వారిపై అఘాయిత్యాలకు నిలుపుదల లేకుండా ఉంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మహిళలు ధైర్యంగా ఉండగలగాలి. ఏ క్షణంలో ఎటువంటి సమస్య వచ్చినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి.ఓ రెస్టారెంట్ లో (restaurant) ఓ వెయిట్రస్ (waitress) పట్ల ఇద్దరు యువకులు అసభ్యంగా (misbehaved) ప్రవర్తించారు. అంతే లేడీ బ్రూస్లీలాగ (Lady Bruce Lee) వారిపైకి విరుచుకుపడింది. దెబ్బకి వాళ్లు పలాయనం చిత్తగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : ద్యావుడా..! మెట్రో ట్రైన్లో బికినీలో యువతి, వీడియో వైరల్
ఓ రెస్టారెంట్ లో ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు. వారికి వెయిట్రస్ వడ్డిస్తోంది. ఉన్నట్టుండీ ఆ యువకుల్లో ఒకడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయాడు. తమ పక్కన వచ్చి కూర్చోమని బలవంతం చేశాడు. వెంటనే ఆమె అతనిని తన పంచ్ లతో (punches) ప్రతిఘటించింది. అంతలో ఆమెను అడ్డుకోవడానికి అతని ఫ్రెండ్ రంగంలోకి దిగడంతో అతడిని కాలితో ఎగిరెగిరి తన్నింది. దెబ్బకి ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. తనను తాను రక్షించుకోవడం కోసం ఆమె ధైర్యంగా పోరాడిన తీరు ఇన్స్పిరేషన్ (inspiration) కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Narendra Modi : మోడీ మీద అభిమానంతో ఓ రైతు ఏం చేశాడంటే? వీడియో వైరల్
“క్యాప్షన్ దిస్” (caption this) అనే టైటిల్ తో ట్విట్టర్ లో షేర్ అయిన ఈ వీడియోని చూసిన జనం వెయిట్రస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూ లేడీ బ్రూస్లీ గా అభివర్ణించారు. ఎటువంటి పరిస్థితుల్ని అయినా ధైర్యంగా ఎదుర్కునేలా ఈ వీడియో ఎంతోమంది ఆడపిల్లలకు ప్రేరణ కలిగిస్తోంది.
— caption this. (@harikarotalar) March 29, 2023