Viral Video : ద్యావుడా..! మెట్రో ట్రైన్‌లో బికినీలో యువతి, వీడియో వైరల్

Viral Video : ఆ యువతి డ్రెస్సింగ్ స్టైల్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇంత పొట్టి పొట్టి దుస్తులతో.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని..

Viral Video : ద్యావుడా..! మెట్రో ట్రైన్‌లో బికినీలో యువతి, వీడియో వైరల్

Viral Video : కొంతమంది పబ్లిసిటీ కోసమో, పాపులారిటీ కోసమో కావాలని చేస్తారో లేక తెలియకుండానే చేస్తారో కానీ.. తమ పిచ్చి పనులు, చేష్టలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మెట్రో రైళ్లలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మెట్రో రైల్ లో కొందరు చేసే పనులు వైరల్ గా మారుతున్నాయి. తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.

తాజాగా ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువతి చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఓ యువతి బికినీలో హల్ చల్ చేసింది. బికినీ లాంటి డ్రెస్ లో యువతి ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Viral Video: నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువకుడు.. విచిత్రంగా చూసిన ప్రయాణికులు

ఢిల్లీ మెట్రో రైల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి బికినీ వంటి దుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఆ యువతి చేతిలో ఓ బ్యాగ్ ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ చాలా దారుణంగా ఉంది. బికినీ తరహాలో దుస్తులు ఉన్నాయి. తోటి ప్రయాణికుల్లో ఒకరు.. యువతిని వీడియో తీశారు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.

Also Read..Delhi : వెరైటీ కోసం పాకులాడి గన్‌తో కేక్ కట్ చేశాడు.. ఆ తరువాత పోలీసులకి చిక్కి…

ఆ యువతి డ్రెస్సింగ్ స్టైల్ చూసి అంతా అవాక్కయ్యారు. బాబోయ్.. ఇదేం డ్రెస్ అని విస్తుపోయారు. కొందరేమో ఆ యువతిని తిట్టిపోస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అసభ్యకరమైన దుస్తులు వేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. యువతి తీరుని తప్పుపడుతున్నారు. ఇంత పొట్టి పొట్టి దుస్తులతో.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని మండిపడుతున్నారు. వీడియో ఆధారంగా యువతిని గుర్తించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ యువతి డ్రెస్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది ఏమైనా ప్యారిస్ అనుకున్నావా? అని ఒకరు అడిగితే.. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలుసా? అని మరొకరు అడిగారు. అసలు.. సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని మెట్రో స్టేషన్ లోకి ఎలా అనుమతించారని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విమర్శించే వాళ్లే కాదు ఆ యువతిని సమర్థించే వాళ్లూ లేకపోలేదు. ఎవరిష్టం వాళ్లది, ఒకరిని అనే హక్కు మనకు లేదని కొందరు వాదిస్తున్నారు. ఆ యువతి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మీకెందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. వేసుకున్న డ్రెస్ లో కాదు చూసే చూపులో, ఆలోచించే విధానంలో తప్పు ఉందని అంటున్నారు.

కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద, ఉత్తమంగా అనుసంధానించబడిన మెట్రో రైల్ నెట్‌వర్క్‌లలో ఒకటి ఢిల్లీ మెట్రో. జాతీయ రాజధాని ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతుంది ఢిల్లీ మెట్రో. అంతేకాదు ఢిల్లీ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ముఖ్యమైన భాగం. 300 కంటే ఎక్కువ రైలు సెట్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి ఢిల్లీ మెట్రో ఎంత గుర్తింపు పొందిందో.. చిత్రవిచిత్రమైన ఘటనలకు కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందింది.