Viral Video: ఇదెక్కడి చోద్యం?.. ఖాళీ పాత్రలను రెండు చేతులతో పట్టుకుని కొడుతూ పెళ్లిలో డ్యాన్స్
పెళ్లి వేడుకలో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు చేయడం సాధారణమే. అయితే, కొందరు శ్రుతి మించి ప్రవర్తిస్తూ డ్యాన్సులు చేస్తుంటారు. ఇటువంటి తీరుతోనే ఓ పెళ్లిలో డ్యాన్సు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఖాళీ పాత్రలను రెండు చేతులతో పట్టుకుని ఒకదానితో మరొకదాన్ని కొడుతూ రెచ్చిపోయారు కొందరు యువకులు. మరి కొందరు కుర్చీలను పైకెత్తి డ్యాన్సు చేశారు.
- T Venkateshwarlu
- Published On : December 12, 2022 / 06:54 AM IST
Viral Video: పెళ్లి వేడుకలో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు చేయడం సాధారణమే. అయితే, కొందరు శ్రుతి మించి ప్రవర్తిస్తూ డ్యాన్సులు చేస్తుంటారు. ఇటువంటి తీరుతోనే ఓ పెళ్లిలో డ్యాన్సు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఖాళీ పాత్రలను రెండు చేతులతో పట్టుకుని ఒకదానితో మరొకదాన్ని కొడుతూ రెచ్చిపోయారు కొందరు యువకులు. మరి కొందరు కుర్చీలను పైకెత్తి డ్యాన్సు చేశారు.
అంకిత్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అన్నం వడ్డించే చోట ఈ డ్యాన్సు చేస్తూ యువకులు వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న వివరాలు తెలియరాలేదు. వేడుకలో మ్యూజిక్ లేకపోయినా డ్యాన్సు మాత్రం ఆగదంటూ పలువురు కామెంట్లు చేశారు. ఇదెక్కడి డ్యాన్స్ అని ఓ యువకుడు పేర్కొన్నాడు.
ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుక మరింత మధురమైన రీతిలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్సులు చేస్తూ పెళ్లి పందిరిలోకి చేరుకుంటున్నారు. అయితే, కొందరు శ్రుతి మించి ప్రవర్తిస్తూ డ్యాన్సులు చేస్తూ తోటివారిని ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారు.
Girls :- yha jyade instruments nhi baj rhe hai dance nhi karungi
Meanwhile Boys :- pic.twitter.com/JN3DbHiGdl
— Ankit $8 (@imoriginalankit) December 6, 2022
