CBI Notices To Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. 91 CRPC కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ మరిన్ని వివరాలు అడిగింది.

CBI Investigate MLC Kavitha on Delhi Liquor Scam
CBI Notices To Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. 91 CRPC కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ మరిన్ని వివరాలు అడిగింది. త్వరలో మళ్లీ కవితను ప్రశ్నించనుంది సీబీఐ. విచారణ తేదీని కూడా త్వరలో వెల్లడించనుంది. నిర్ణీత సమయంలో డాక్యుమెంట్స్ లేదా డివైజ్ లు సీబీఐకి ఇవ్వాలని నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఆదివారం ఏడున్నర గంటల పాటు కవితను ఆమె నివాసంలో సీబీఐ అధికారులు విచారించారు.
Also Read..Delhi liquor scam: ముగిసిన కవిత సీబీఐ విచారణ.. ఏడున్నర గంటలు ప్రశ్నించిన అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని కవిత నివాసంలో విచారించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది.
Also Read..Delhi liquor scam: సీబీఐ విచారణ ముగిశాక.. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో కవిత భేటీ
ఈ విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత గతంలో వాడిన సెల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.