Delhi liquor scam: ముగిసిన కవిత సీబీఐ విచారణ.. ఏడున్నర గంటలు ప్రశ్నించిన అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.

Delhi liquor scam: ముగిసిన కవిత సీబీఐ విచారణ.. ఏడున్నర గంటలు ప్రశ్నించిన అధికారులు

MLC Kavitha

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.

సీఆర్పీసీ 161 కింద కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకుముందే సీబీఐ విచారణ గురించి కవిత న్యాయ నిపుణులతో చర్చించారు. నేటి విచారణలో భాగంగా అరోరాతో లింకేంటి?, ఆ రూ.100 కోట్లు ఎక్కడివి? అనే ప్రశ్నలు కవితను సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈడీ రిమాండు రిపోర్టులో ఆమె పేరును పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్రతో పాటు కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ చెప్పింది. కాగా, కవితను చూసేందుకు ఆమె ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు వస్తున్నారు.

#JanaSenaTelangana: తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధం… పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కసరత్తులు షురూ