Viral video: మనిషిని హత్తుకున్న సింహం.. వీడియో చూసి ‘వామ్మో’ అంటున్న నెటిజన్లు
వన్య మృగాలపై చాలా మంది ఎంతో ప్రేమను కనబర్చుతారు. కొందరు వన్య మృగాలకు భయపడకుండా వాటిని హత్తుకుని మరీ తమ ప్రేమను చూపుతారు. అలాగే, తమకు బాగా అలవాటైన వారిని చూడగానే వన్య మృగాలు మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఇటువంటి ఘటనే ఓ పార్కులో తాజాగా చోటుచేసుకుంది.
- T Venkateshwarlu
- Published On : January 5, 2023 / 03:47 PM IST
Viral video
Viral video: వన్య మృగాలపై చాలా మంది ఎంతో ప్రేమను కనబర్చుతారు. కొందరు వన్య మృగాలకు భయపడకుండా వాటిని హత్తుకుని మరీ తమ ప్రేమను చూపుతారు. అలాగే, తమకు బాగా అలవాటైన వారిని చూడగానే వన్య మృగాలు మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఇటువంటి ఘటనే ఓ పార్కులో తాజాగా చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సింహం ఉంటే చోటులోకి ప్రవేశించాడు. అతడిని చూడగానే ఆ సింహం హత్తుకుంది. అచ్చం మనిషిలాగే పడేసింది. అది చూపించిన ప్రేమకు ఆ వ్యక్తి ముగ్దుడైపోయాడు. అతడిని కిందపడేసి మరీ హత్తుకుంది ఆ సింహం. ఆ వ్యక్తి కనపడిన వెంటనే ముందు కాళ్లను పైకి లేపుతూ అది ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది.
సింహంతో ఆ వ్యక్తిని ఉన్న స్నేహ బంధం చాలా గొప్పదని, ఇది అందరికీ సాధ్యపడనిదని కొందరు కామెంట్లు చేశారు. వన్యమృగాలతో ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ వాటితో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని కొందరు అంటున్నారు. వీడియో చూసి ‘వామ్మో’ అంటూ కొందరు పేర్కొన్నారు.
Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!
