Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

పచ్చిరొట్టను ప్రధాన పంటకు ముందుగా కానీ లేదా అంతర పంటలా కానీ వేసుకోవచ్చును. వచ్చి రొట్ట ఎరువుతో తక్కువ ఖర్చుతో లాభసాటిగా మట్టిని ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చును. తొలకరి వర్షాలకు ఏ రకపు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలనైనా విత్తుకోవాలి. ఒక ఎకరాకు 15-20 కిలోల జనుమును జల్లుకుంటే అది 45 రోజుల్లోనే 8-10 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది.

Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

The use of organic fertilizers in agriculture leads to higher yields and lower costs!

Organic Fertilizers : సేంద్రియ ఎరువులు ముఖ్యంగా స్థూల మరియు గాఢ సేంద్రియ ఎరువులగా విభజించవచ్చు. స్టూల సేంద్రియ ఎరువులను ఎక్కువ మొత్తంలో పొలంలో చల్లుతారు. ఇవి కొంత మేర పంటకు పోషకాలను అందించడమే కాక, మట్టి భౌతిక స్వరూపాన్ని మరియు నీటిని పట్టి ఉంచే గుణాన్ని పెంచి, నేలలోని పోషకాలను మొక్కలకు అందేలా చేస్తాయి. ఇతర సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందించడమే కాక వ్యాధికారక శిలీరధ్రాల నియంత్రణలో తోడ్చడతాయి. సాధారణంగా ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు , పచ్చి రొట్ట ఎరువులను స్థూల సేంద్రియ ఎరువులుగా పరిగణించవచ్చు.

పొలంలోని చెట్ల ఆకులు, ఇతరత్రా మొక్కల మరియు జంతువుల వ్యర్థాలు పశువుల కేడ, మూత్రంతో సహజం గానే కుళ్ళి మట్టిలా మారిన దాన్నే పొలం ఎరువు అంటాం. బంగాళాదుంప, టమాటా తీవి బంగాళా దుంవ, క్యారెట్లొ ముల్లంగి, ఉల్లి మొదలగు కూరగాయలు పాలం ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా చెరకు, వరి, అరటి, మామిడి, కొబ్బరి ఇతరత్రా గడ్డి మొక్కలు పొలం ఎరువుగా ఉపకరిస్తాయి. కుళ్ళిన చెట్ల మరియు పశువుల సేంద్రియ పదార్థాలనే కంపోస్టుగా పిలుస్తారు. వానపాము ఎరువులు తయారు చేసే యూనిట్లను సంవ్రదించినా మనం నులభంగా ఈ ఎరువును పొలంలో వాడుకోవచ్చు.

వానపాము ఎరువులో నత్రజని, భాస్వరం, పోటామ్‌తో పాటు సల్ఫర్‌, కాల్షియమ్‌, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌ మరియు కాపర్‌ వంటి చాలా రకాల పోషకవిలువలు ఉంటాయి. ఇతర ఏరకమైన ఎరువులోను లభించని వివిధ రకాల ఎంజైములు ఈ వానపాము ఎరువులో లభిస్తాయి. ఇవి మట్టిలోని సూక్ష్మ జీవుల పెరుగుదలకు తోడ్పడి, నేలలోని వ్యర్థపదార్థాలు త్వరగా కుళ్ళి కంపోస్ట్ గా మారటానికి ఉపయోగపడతాయి. వర్మికంపోస్ట్ వేసిన నేలను పరిక్షిస్తే నాలుగు నుండి ఐదు రెట్లు ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

పచ్చిరొట్ట ఎరువులదే కీలకపాత్ర ;

పచ్చి రొట్ట ఎరువులు అనేవి సేంద్రియ వ్యవసాయంలో ఒక ప్రముఖ పాతని పోషిస్తాయి. ముఖ్యంగా వశువుల ఎరువులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇవి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. వీటిని పొలంలోనే ప్రధానపంటతో పాటుగా పెంచి, వచ్చిగా ఉండగానే తిరిగి మట్టిలోనికి కలియదున్నాలి. జనుము, పిల్లి పెసర, జీలుగ, అలసంద, వెంపలి, ఉలవతో పాటు పెనర మినవలను వచ్చి రొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడతాయి. వీటి కాయలు కోసుకున్న అనంతరం నేలలో కలియ దున్నుకోవచ్చును. ఒక టన్ను పచ్చి రొట్ట ఎరువు మూడు టన్నుల పొలం ఎరువుకు సమానం అంటే, పది కేజీల యూరియాకు సమానం.

పచ్చిరొట్టను ప్రధాన పంటకు ముందుగా కానీ లేదా అంతర పంటలా కానీ వేసుకోవచ్చును. వచ్చి రొట్ట ఎరువుతో తక్కువ ఖర్చుతో లాభసాటిగా మట్టిని ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చును. తొలకరి వర్షాలకు ఏ రకపు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలనైనా విత్తుకోవాలి. ఒక ఎకరాకు 15-20 కిలోల జనుమును జల్లుకుంటే అది 45 రోజుల్లోనే 8-10 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. దీనివల్ల 50కిలోల నత్రజని ప్రధానపంటకు అందుతుంది. ఈ పచ్చిరొట్టను పూత పూసే సమయానికి నేలలో కలియ దున్నాలి అనగా సుమారు 45 రోజులకు. అలాకాక పోతే, కాండం గట్టివడి దున్నటానికి ఇబ్బందిగాను, కుళ్ళకుండా అలానే ఉంటాయి.

పచ్చిరొట్ట కుళ్ళుటకు సుమారు 15 రోజులు సమయం పడుతుంది. గొరై, మేక మొదలగు పశువుల ఎరువులు కూడా స్ధూల సేంద్రీయ ఎరువులే. అందుబాటులో ఉంటే వీటినే ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. గాఢ సేంద్రియ ఎరువుల్లో స్థూల సేంద్రియ ఎరువు కంటే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. వివిధ రకాల నూనె గింజల యొక్క గానుగ వ్యర్థాలు, పశువుల ఎముకల, కొమ్ములు, గిట్టల వ్యర్థాలు గాఢ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయి. ఈ రకపు ఎరువులు నెమ్మది నెమ్మదిగా పోషకాలను మొక్కలకు చాలా ఎక్కువ రోజుల పాటు అందిస్తాయి.

గానుగ వ్యర్థాలు అంటే నూనె గింజల నుండి నూనెను సేకరించగా మిగిలి, మిల్లు నుండి వెలువడే వ్యర్ధాలు. వేరు శనగ, నువ్వులు, ఆముదం, కొబ్బరి, వేప, పత్తి మొదలగు గానుగ వ్యర్థాలు సులభంగానే ఆయా ప్రాంతాలను బట్టి అఖిస్తాయి. దాదావు అన్ని రకాల గానుగ వ్యర్థాలు మొక్కలకు కావలసిన ముఖ్యమైన పోషణను అందిస్తాయి. రైతులు సాధారణంగా వాడే కృత్రిమ రసాయన ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పోటామ్‌లు ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికి, అవి క్రమ క్రమంగా నేలలోని మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోయేలా చేస్తాయి. నేలయొక్క భౌతికస్వభావం కూడా పూర్తిగా దెబ్బ తింటుంది.

అధిక పెట్టుబడి తో కూడిన వ్యవసాయం చేస్తూ, నేలను నిర్వీర్యం చేస్తూ భవివ్యత్తులో వ్యవసాయం మరింత కిష్టమైన స్థితికి చేరుతుంది. అందుకనే, క్రమ క్రమంగా ఈ సేంద్రియ ఎరువులను వంటలకు అందిస్తూ, నేలభౌతిక స్వభావాన్ని సూక్ష్మజీవులను కాపాడుతూ ఆరోగ్యవంతమైన నేలను, పంటలను, పర్యావరణాన్ని మరియు జీవనాన్ని పొందడం మన అందరి భాద్యతని నిపుణులు సూచిస్తున్నారు.