Viral Video: నడిరోడ్డుపై బైక్‌కు అంటుకున్న నిప్పు.. ఎంతమంది కలిసి ఆర్పేశారో.. వీడియో వైరల్
ఎవరికైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కొన్నిసార్లు అందరూ ముందుకొస్తారు. అందరూ తలో చేయి వేస్తారు. తాజాగా జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. ఒక బైకుకు అంటుకున్న మంటల్ని ఆర్పేసేందుకు ఎందరు ముందుకొచ్చారో చూడండి.
- Narender Thiru
- Published On : October 11, 2022 / 06:01 PM IST
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిలో ఇదీ ఒకటి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది వస్తే అనేకసార్లు చుట్టుపక్కల వాళ్లు తమకేం పట్టనట్లే వెళ్లిపోతుంటారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటారు.
Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన
కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం అందరూ సాయపడతారు. అవసరమైనంత హెల్ప్ చేస్తారు. ఒక సమస్యను ఎదుర్కోవడానికి చాలా మంది ముందుకొచ్చిన సంఘటన తాజాగా జరిగింది. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను సుశాంత నందా అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. ‘ఒక మహిళతో ఒక వ్యక్తి స్కూటర్‌పై వెళ్తుండగా, బైక్ నుంచి పొగలు వస్తుంటాయి. ఇది గమనించి రోడ్డుపైనే బైక్ ఆపేస్తారు. ఆ లోపే బైకు నుంచి మంటలు అంటుకుంటాయి. దీంతో ఆ వ్యక్తి బైక్ స్టాండ్ వేసి, మహిళతోపాటు పక్కకి వెళ్లిపోతాడు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు వచ్చి బైకుపై నీళ్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు.
Kerala Women: కేరళలో నరబలి.. గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య.. డబ్బు కోసం భార్యాభర్తల దురాగతం
ఆ తర్వాతో మరో ఇద్దరు ముగ్గురు నీళ్లు చల్లుతారు. తర్వాత వేరే వ్యక్తి మంటలు ఆర్పే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చి పూర్తిగా బైక్‌పై స్ప్రే చేస్తాడు. ఇలా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి అనేక మంది చేయి కలిపి రావడం మన దగ్గరే జరుగుతుందని సుశాంత తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This can happen only in India. Joining hands to avert disaster? pic.twitter.com/FU0ss3olZ2
— Susanta Nanda (@susantananda3) October 11, 2022
