America burger king viral Tweet : ఏ సంస్థలైనా తమ వ్యాపారాలను డెవలప్ చేసుకోవటానికి రకరకాల యత్నాలు చేస్తాయి. అవసరమైన పక్క సంస్థలను తొక్కేసి మరీ వ్యాపారాలను డెవలప్ చేసుకుంటాయి. ముఖ్యంగా బాగా పేరు సాధించిన సంస్థలు అభివృద్ది రేసులో దూసుకుపోవటానికి పోటీ సంస్థలను తొక్కేసి మరీ దూసుకెళ్లటానికి యత్నిస్తాయి. కానీ ఓ సంస్థ మాత్రం తమ వ్యాపారమే కాదు ఈ కరోనా కష్టకాలంలో తోటీ సంస్థలు కూడా కోలుకోవాలనీ..తిరిగి వారి వ్యాపారాలు పుంజుకోవాలనే మంచి ఉద్ధేశ్యంతో మా సంస్థవే కాదు వేరే సంస్థలవి కూడా కొనండీ అంటూ తమ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇది నిజంగా చాలా గొప్ప ఉద్ధేశ్యమని చెప్పాలి. ఆ గొప్ప సంస్థే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ ‘‘బర్గర్ కింగ్’’.
వైరల్ గా మారిన బర్గర్ కింగ్ ట్వీట్
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రపంచ దేశాలు ఆంక్షలను ఎత్తివేసినా..వ్యాపారాలు తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పట్లో బైటపుడ్ లు తినటానికి ప్రజలు ఇంకా భయపడుతున్నారు. దీనికి తోడు పాశ్చాత్య దేశాల్లో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సంస్థ ‘‘బర్గర్ కింగ్’’ తమ వినియోగదారులకు చేసిన విజ్ఞప్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అభినందించేలా చేసింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో బర్గర్ కింగ్ సంస్థ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మార్కెట్ పరంగా చూస్తే బర్గర్ కింగ్ కు మెక్ డొనాల్డ్స్ గట్టి పోటీ ఉంది.
ఇతర సంస్థల నుంచి కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి
కరోనా మహమ్మారి తెచ్చిన నష్టాలను అధిగమించడానికి మెక్ డొనాల్డ్స్ వంటి ఇతర సంస్థల నుంచి కూడా కొనుగోళ్లు చేయాలని బర్గర్ కింగ్ ట్విట్టర్ లో తమ అభిమానులను కోరింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
కరోనా సంక్షోభంలో సహాయాలు అవసరం
‘మా పోటీ సంస్థలైన KFC, డొమినోస్ పిజ్జా, సబ్ వే, ఫైవ్ గాయ్స్, గ్రెగ్స్, పాపా జాన్స్, టాకో బెల్, ఇతర ఫుడ్ అవుట్‌లెట్ల నుంచి ఆహారం ఆర్డర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాం. మేము మీకు ఇలా విజ్ఞప్తి చేస్తామని ఇంతకు ముందు ఎప్పుడూ ఊహించలేదు. రెస్టారెంట్లలో వేలాది మంది సిబ్బంది పనిచేస్తుంటారు.
కరోనా సంక్షోభంలో సహాయాలు అవసరం
ఈ సంక్షోభ సమయంలో ఇలాంటి సంస్థలకు మీ మద్దతు చాలా అవసరమని మేం భావించాం. కాబట్టి.. మీరు సహాయం చేయాలనుకుంటే, హోమ్ డెలివరీ, టేక్ ఎవే ద్వారా రుచికరమైన ఆహారాన్ని పొందండి’ అని బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో ఈ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజ సంస్థను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇది గౌరవంతో కూడిన పోస్టు అని పలువురు కామెంట్ చేయగా.. ఇది ఎంతో సంపూర్ణమైన విజ్ఞప్తి అని మరికొందరు బర్గర్ కింగ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఇది చాలా గొప్ప విషయమని ఇంకొందరు అభినందలు తెలుపుతున్నారు.
సామాజిక బాధ్యతలో నేనున్నానంటున్న బర్గర్ కింగ్ సంస్థ
బర్గర్ కింగ్ సంస్థ కేవలం తన వ్యాపారంలోనే కాక సామాజిక బాధ్యతలో కూడా నేనున్నానంటోంది. కేవలం కాసుల సంపాదన ధ్యేయంగా కాకుండా మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి మెంటల్ హెల్త్ అమెరికా సంస్థతో కలిసి పనిచేస్తోంది. ఈ సేవలో భాగంగా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సీటెల్, ఆస్టిన్, టెక్సాస్, మియామిల్లో “Real Meals” పేరుతో స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తోంది.Mental Health Month సందర్భంగా పలు రకాల ఆహారాలు, మానసిక ఆరోగ్యం వాటి ప్రభావం గురించి ఆ సంస్థ అవగాహన కల్పించింది.
We know, we never thought we’d be saying this either. pic.twitter.com/cVRMSLSDq6
— Burger King (@BurgerKingUK) November 2, 2020