మనిషిని స్కాన్ చేసి సూట్ అయ్యే డ్రస్ చెప్పే యాప్

  • Publish Date - February 13, 2020 / 11:04 AM IST

వాలెంటైన్స్ డే రోజు ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అని టెన్షనా..? ఎంత షాపింగ్ చేసినా సూట్ అయ్యే డ్రస్ లేదా.. మీకోసమే ఓ కొత్త యాప్. మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్లి నాలుగైదు  వెరైటీల‌ను ట్రై చేసి ఆ డ్రస్ మనకు సెట్ అవుతుందో లేదో ఇంత డౌట్  అవసరమా? హ్యాపీగా ఇంట్లోనే ఉండి ‘మిర్రర్ సైజ్ యాప్’ లో షాపింగ్ చేయచ్చు.

ఇందులో మీకు నచ్చిన కలర్, మోడల్ సెలక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు ఆ సైజ్ వస్తుందో లేదో అనే టెన్షన్ కూడా అవసరం లేదు..  ఈ మిర్ర‌ర్ ఎదురుగా నిల‌బ‌డితే చాలు, అందులో ఉండే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌న శ‌రీరాన్ని స్కాన్ చేస్తుంది.  ఎత్తు, సైజ్, క‌ల‌ర్ స్కాన్ చేసి సెట్ అయ్యే డ్రస్ ను చూపిస్తుంది.  కావ‌ల్సిన డ్రస్ ను ఈజీగా సెలక్ట్ చేసుకోవ‌చ్చు.

ఈ యాప్ వ‌ల్ల ప‌దే ప‌దే డ్రస్ ట్రైల్ చేసి స‌రిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సిన ఇబ్బంది త‌ప్పుతుంది. టైం సేవ్ అవుతోంది, మీకు సెట్ అయ్యే డ్రస్ దొరుకుతుంది.