Priyanka chopra
Priyanka chopra : ప్రియాంక చోప్రాకి (priyanka chopra) ప్రపంచవ్యాప్తంగా అభిమానులు (fans) ఉన్నారు. ఏజ్ పెరుగుతున్నా ఆమెలో జోష్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మాజీ ప్రపంచ సుందరి మగవాడిగా పుట్టి ఉంటే ఎలా ఉండేదో ఊహించగలరా? ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి? అని అనుకోవచ్చు. ఓ ఆర్టిస్ట్ ప్రియాంక చోప్రా ఫోటోని అబ్బాయి రూపంలోకి మార్చేసి తన టాలెంట్ చూపించాడు. తగ్గేదే.. లే అన్నట్లు అబ్బాయి రూపంలో కూడా ప్రియాంక అదరహో అనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
rented room like a prison : జైలు గది కాదు నమ్మండి.. బెంగళూరులో అద్దె ఇల్లు ఫోటో వైరల్
జోస్ ఆంటోనియో సాలిబా (José Antonio Saliba) అనే ఆర్టిస్ట్ (artist) గతంలో చాలామంది సెలబ్రిటీలను (celebrities) ఆడవారిని మగవారిగా..మగవారిని ఆడవారిగా చిత్రించి టాలెంట్ చూపించాడు. అయితే లేటెస్ట్ గా అతడు పోస్ట్ చేసిన వీడియోలో ప్రియాంక చోప్రా మొహాన్ని అబ్బాయిగా మార్చేసాడు. డిజిటల్ పెన్ సాయంతో కళ్లు, కను రెప్పలు, పెదవులు, గెడ్డం, ముక్కు అన్నీ మార్చాడు. ఇక హెయిర్ స్టైల్ ను ఛేంజ్ చేశాడు. అంతే ఒక హ్యాండ్ సమ్ అబ్బాయి రూపం మనకి కనిపిస్తుంది. ఇక ఈ వీడియోని జోస్ “ప్రియాంక చోప్రా అబ్బాయిగా” అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశాడు.
rented room like a prison : జైలు గది కాదు నమ్మండి.. బెంగళూరులో అద్దె ఇల్లు ఫోటో వైరల్
ఇక ఈ పోస్ట్ 2.1 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. ఈ పోస్ట్ మీద అనేకమంది స్పందించారు. ఒకరు ఆమె ఇటాలియన్ లా ఉందని.. మరొకరు ఈ చిత్రాన్ని గీసిన జోస్ ఆంటోనియో AI కంటే ప్రమాదకరమైనవాడని జోక్స్ వేశారు. ఇంకొకరు మనుష్యుల ముఖాలకు రూపం ఇచ్చే పని ఆ భగవంతుడు జోస్ కు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. మొత్తానికి ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.