ద్యావుడా..పొట్టా లిక్కర్ ఫ్యాక్టరీయా: అతని పొట్టలో మద్యం తయారవుతోంది..షాక్ అయిన పోలీసులు

  • Publish Date - July 12, 2020 / 06:41 PM IST

లిక్కర్ ఎక్కడ తయారవుతుంది? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న..ఫ్యాక్టరీలో తయారవుతుంది ఈ మాత్రం కూడా తెలీదా? అంటారు. కానీ ఓ మనిషి పొట్టలోనే మద్యం తయారు కావటం గురించి ఎప్పుడన్నా చూశారా?కనీసం విన్నారా? బహుశా కనీవినీ ఎరుగం కదూ..కానీ ఇది నిజంగా నిజం. మద్యాన్ని తయారుచేసే ఆ పొట్ట తాలూకూ మనిషిది అమెరికాలోని న్యూజెర్సీ. అతని పేరు డానీ జియానోట్టో. వయస్సు 46ఏళ్లు. ఇతనిది ఓ విచిత్ర పరిస్థితి.

వివరాల్లోకి వెళితే..న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తున్న డానీ జియానోట్లోని 2019తో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడని పోలీసులు ఆపారు. నేను డ్రింక్ చేయలేదని చెప్పాడు. నేనసలు మద్యం ముట్టుకోనని కనీసం దాని వాసన అంటే కూడా నాకు నచ్చదని మొత్తుడుకున్నాడు. కానీ పోలీసులు వినలేదు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేశారు. పోలీసులు వెటకారంగా అతనివైపు చూసి ఎనలైజర్ పెట్టారు. ఆ మెషీన్ లో డానీ మద్యం సేవించినట్లుగా చూపించింది. కానీ నేను మద్యం తాగలేదు మొర్రో నామీద కేసు రాయవద్దంటూ వేడుకున్నాడు. కానీ పోలీసులు వినలేదు. కానీ అతను పదే పదే అదే మాట చెబుతుంటే విసుగు వచ్చిన పోలీసులు..ఇతనితో గొడవెందుకు పరీక్షలు చేయిస్తే సరిపోతుంది కదానుకుని అతన్ని ఓ ఆసుపత్రిలో అతనికి పరీక్షలు చేయించగా డాక్టర్లు సైతం ఆశ్చర్యకర విషయం బయటపడింది.

అతని శరీరంలోనే మద్యం తయారవుతుందని డాక్టర్ల పరీక్షలో తేలింది. ఇది చాలా అరుదైన పరిస్థితనీ..ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ఏబీఎస్) కారణంగా కడుపు తనలోని కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్‌గా మారుస్తుందని డాక్టర్లుతెలిపారు. ఈ విషయం తెలియగానే పోలీసులు డానీ జియానోట్టోపై చేసిన ఆరోపణలను విరమించుకున్నారు. అంతేకాదు..ఆ మాట విన్న డానీ కూడా ఆశ్చర్యపోాయాడు. ఇంతకాలం తనని అందరూ తాగుబోతు అని ఎందుకంటున్నారో అర్థం కాక తల పట్టుకునే డానీకి అసలు విషయం తెలిసి..నవ్వాలోె ఏడవాలో అర్థం కాలేదు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్యర్చపోాయాడు.

కానీ గతంలో కూడా పాపం డానీ తాగుబోతోడు అనే అవమానాలు చాలానేపడ్డాడు. ఆఖరిని అతని తల్లి భార్యా కూడా తాగుడు తగ్గించుకోమని ఎన్ని సార్లు చెప్పినా వినవే అంటూ తిట్టిపోసేవారని డానీ వాపోడు. అంతేకాదు తన ఇరుగుపొరుగు వారు..తోటి ఉద్యోగులు కూడా తనను తాగుబోతోడని నిందించేవారని తెలిపాడు. కానీ డానీ పరిస్థితి తెలిసిన తరువాత భార్యతో పాటు ఇన్నాళ్లు అపార్థం చేసుకున్నవారంతా డానీని క్షమించాలని కోరారు.

బాగెల్, పిజ్జా , పిండి పదార్థాలు ఉన్న ఏదైనా ఆహారం తీసుకోగానే ఆటోమేటిక్‌గా డానీ కడుపులో ఆల్కహాల్ స్థాయిలు పెరుగుతాయని డాక్టర్లు చెప్పటంతో వీటివల్లే నేను ఇంతకాలం అవమానాలు పడ్డాను. ఇక ఎప్పుడూ నా లైఫ్ లో కార్బోహ్రైడ్రేట్లు ముట్టకూడదని డానీ జియానోట్లో గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏది ఏమైనా ఇటువంటి సమస్య చాలా చిత్రమైనదే కదా.