students celebrate no bag day
Students fun at college: ఆడవారికి బ్యాగ్స్ (bag) అంటే మక్కువ ఎక్కువ. స్కూల్ ఏజ్ వరకూ పుస్తకాలు (books), లంచ్ బాక్స్(lunch box), స్నాక్స్ వరకూ బ్యాగ్స్‌లో నింపుతారు. ఇక కాలేజ్ చదువులకి వచ్చేసరికి పుస్తకాలతో పాటు మ్యాకప్ సామాగ్రి, చాక్లైట్స్‌తో పాటు చాలా వస్తువుల్ని క్యారీ చేస్తారు. చెప్పాలంటే వారి బ్యాగ్ ఓ పెద్ద ప్రపంచం అని చెప్పాలి. అలాంటిది ఒకరోజు బ్యాగ్ క్యారీ చేయద్దు అంటే ఉండగలరా? పోనీ ఒకరోజు బ్యాగ్‌కి బదులు వేరేదైనా క్యారీ చేయండి అంటే వారు ఏం చేస్తారు? ఈ ఆలోచన చాలా ఫన్నీగా ఉంది కదా.. విషయానికి వద్దాం.
PM Modi: పానీ పూరీ టేస్ట్ చేసిన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో.. వీడియో వైరల్
స్టూడెంట్స్‌లో క్రియేటివిటీ నింపేందుకు, వాళ్లని యాక్టివ్ చేసేందుకు కాలేజీలలో సరదాగా కొన్ని పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే చెన్నై క్రిష్టియన్ ఉమెన్స్ ( Women’s Christian College) కాలేజ్ విద్యార్ధినులకు ఓ వింత ఆలోచన వచ్చింది. కాలేజ్‌కి బ్యాగ్ కాకుండా ఇంకేదైనా క్యారీ చేసి తీసుకుని రావాలంటే ఏం తీసుకువస్తారు?.. ఇదే ఆలోచనతో ‘నో బ్యాగ్ డే’ (no bag day) నిర్వహించారు. ఇంకేముంది ఈ కాన్సెప్ట్‌కి స్టూడెంట్స్ నుంచి భలే రెస్పాన్స్ వచ్చింది.
Modi The Immortal : చైనాలో ప్రధాని మోదీని ఏమని పిలుస్తారో తెలుసా..? ఏకంగా ముద్దుపేరు పెట్టేశారు..
కాలేజీ విద్యార్ధినులు బ్యాగ్‌కి బదులుగా ప్రెజర్ కుక్కర్ (pressure cooker), బాస్కెట్, బకెట్ (bucket), టవల్, కార్డ్ బోర్డ్, పిల్లో కవర్, స్యూట్ కేస్, ట్రాలీ బ్యాగ్, మగ్… ఇలా కాదేది కవితకి అనర్హం అన్నట్లు బ్యాగ్‌కి బదులు తమకి నచ్చిన వస్తువులు తమ వెంట తెచ్చి ప్రదర్శించారు. ఎంతో ఫన్ గా జరిగిన ఈ కార్యక్రమం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారంతా సరదాగా రెస్పాండ్ అవుతున్నారు. ఏది ఏమైనా వింత వింత కాన్సెప్ట్‌లతో వైరల్ అవ్వాలనుకునే సంప్రదాయం కాలేజ్‌ల వరకూ పాకడం విశేషం.