అరిజోనాలోని ఫినిక్స్ లోని ఓ అపార్ట్ మెంట్ శుక్రవారం (జులై 9,2020)లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తన బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలు తాను చనిపోయినా పరవాలేదనుకుంది ఓ తల్లి తన మూడేళ్ల కొడుకుని మూడో అంతస్తు ఫ్లాట్ కిటికీలోంచి కిందకు విసిరేసింది. అది గమనించిన ఓ ఫుట్‌బాట్ ఆటగాడు ఫిలిప్ బ్లాంక్ ఆ బాలుడిని క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడాడు.
ఆ తరువాత ఆ తల్లి మంటల్లో చిక్కుకున్న ఎనిమిదేళ్ల కూతుర్ని కూడా రక్షించడం కోసం మంట్లోకి దూసుకెళ్లింది. కూతుర్ని రక్షించుకోగలిగింది. కానీ దురదృష్టవశాత్తు తల్లి రచెల్‌లాంగ్ ఆ మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. సురక్షితంగా బైటపడ్డ ఆ చిన్నారులిద్దరు తల్లిని కోల్పోయిన ఘటనతో అరిజోనాలోని ఫినిక్స్ లోని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.
అనంతరం చిన్న చిన్న గాయాలుఅయిన బాలుడిని, బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. ఇక ఆటగాడు ఆ బాలుడిని కాపాడిన సమయంలో తీసిన వీడియో బయటకు వచ్చింది. ఆయన ఫుట్‌బాల్ స్కిల్స్ బాలుడిని కాపాడేందుకు ఉపయోగపడ్డాయని స్థానికులంతా ఫిలిప్ బ్లాంక్ ప్రశంసిస్తున్నారు.
Read Here>>ఇండియాలో ‘Taka Tak’ కొత్త యాప్… టిక్‌టాక్‌కు ధీటైన ఫీచర్లు ఇవిగో..!