వావ్..కూతురి సంతోషం కోసం తండ్రి భలే ఐడియా!: వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 11:02 AM IST
వావ్..కూతురి సంతోషం కోసం తండ్రి భలే ఐడియా!:  వైరల్ వీడియో

Updated On : February 24, 2020 / 11:02 AM IST

తండ్రి ఏదో పనిచేసుకుంటున్నాడు. ముద్దుల కూతురు వచ్చింది. ‘‘ప్లీజ్ నాన్నా నన్ను ఆడించవా..రా ఆడుకుందాం..అంటూ అడిగింది. కూతుర్ని ఎలా అంటూ ఆలోచించాడు.. బాగా ఆలోచించాడు. అద్ధిరిపోయే ఐడియా వచ్చింది. సూపర్ గా ఉంది ఇంకేంటి వెంటనే అమలు చేసేశాడు. అదికూడా రూపాయి ఖర్చు లేకుండానే. 

టీవీ పెట్టాడు.నాన్నా ఆడుకుందామంటే టీవీ పెడతావేంటి రా..అంటూ తండ్రి చేయి పట్టి లాగింది ఆ చిన్నారి. ఇక్కడే ఆడకుందాం బంగారం..నిన్ను రోలర్ కోస్టర్ ఎక్కిస్తాగా..అన్నాడు. ఏంటీ ఇంట్లో రోలర్ కోస్టరా? అని అమాయకంగా కళ్లు చక్రాల్లా తిప్పుతు అడిగింది చిట్టితల్లి. ఆ..రోలర్ కోస్టరే అంటూ టీవీలో రోలర్ కోస్టర్ గేమ్ ప్లే చేశాడు. తరువాత తన చిట్టితల్లిని ఓ ప్లాస్టిక్ బుట్టలో కూర్చోపెట్టాడు. టీవీలో రోలర్ కోస్టర్ గేమ్ ప్లే అవుతుంటే… ఆ పిల్ల కూర్చున్న బుట్టను వెనకాల నిలబడి నాన్న రోలర్ కోస్టర్‌కి మూమెంట్ అయినట్లుగా అటూ ఇటూ ఊపుతూ…నిజంగానే రోలర్ కోస్టర్ ఎక్కిన ఫీలింగి కలిగించాడు కూతురికి.

ఇంకేమంది చిట్టితల్లి ఎక్కడ లేని ఆనందం. తను ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోయింది  పాప… నిజంగానే రోలర్ కోస్టర్ ఎక్కి రయ్ రయ్ మంటూ వెళ్తున్నట్లుగా ఫీలైపోతూ… మధ్య మధ్యలో కేరింతలు కొడుతూ… ఒక్కోసారి కింద పడిపోతానేమో అన్నట్లు భయపడుతూ ఉంటే… ఆ మొత్తం వీడియో తీసిన ఆ తండ్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

రూపాయి ఖర్చులేకుండా నాన్న ఐడియా భలే ఉందే అంటున్నారు నెటిజన్లు. ఆ వీడియో గేమ్ పేరు ఏంటని మరొకొందరు అడుగుతున్నారు.  అద్భుతంగా ఉంది ఈ నాన్నగారి ఐడియా మరికొందరు పొగుడుతున్నారు. పది రోజుల కిందట అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని తెగ హల్ చల్ చేస్తోంది.  రూపాయి ఖర్చులేకుండా… ఇంట్లోనే ఉంటూ… రోలర్ కోస్టర్‌లో వెళ్తున్నట్లు ఫీల్ కలిగిస్తూ… ఆ పిల్లకు అమితానందాన్ని కలిగించిన తీరు… మనం కూడా ఇలా చేస్తే అని అంతా అనుకునేలా ఉంటోంది.

మీరు కూడా రూపాయి ఖర్చులేని ఈ గేమ్ పై ఓ లుక్కేయండి..పైసా ఖర్చులేకుండా మీ పిల్లలను చక్కగా ఆడించండీ..ఎంజాయ్ చేయండి..