కొత్తగా లోన్ తీసుకునే వారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఓ పెద్ద తలనొప్పి తగ్గిపోయింది..
CIBIL Score : క్రెడిట్ స్కోర్ లేకుండా బ్యాంకుల నుంచి రుణం పొందొచ్చా..? అనేది చాలా మందిలో సందేహం ఉంటుంది. వారి సందేహాలను నివృత్తి చేసేలా

CIBIL Score
CIBIL Score : బ్యాంకుల నుంచి లోన్లు పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి. అయితే, చాలా మందికి సిబిల్ స్కోర్ (CIBIL Score) సరిపడా లేకపోవటంతో బ్యాంకులుసైతం రుణాలు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నాయి. ఈ తరుణంలో వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బ్యాంక్ లోన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
క్రెడిట్ స్కోర్ లేకుండా లోన్ పొందొచ్చా..? అనేది చాలా మందిలో సందేహం ఉంటుంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం రుణాలు, సిబిల్ స్కోర్ వంటి అంశాలపై కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. మొదటిసారి లోన్లు తీసుకునే వారికి మినిమమ్ సిబిల్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. క్రెడిట్ స్కోరు లేకపోయినా బ్యాంకులు లోన్ కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించలేవని స్పష్టం చేశారు.
మొటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తో పనిలేదని, అయితే, సబిల్ స్కోరు తప్పనిసరి కాకపోయినా బ్యాంకులు దరఖాస్తుదారులపై బ్యాక్ గ్రౌండ్ చెకింగ్స్ చేయాలని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సూచించారు. ఇందులో క్రెడిట్ హిస్టరీ, రుణ చెల్లింపుల వివరాలు, రీస్ట్రక్చర్, రైటాప్ వంటి అంశాలు పరిశీలించాలని అన్నారు.
సిబిల్ స్కోరు అనేది 300 – 900 మధ్యలో ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది వ్యక్తి క్రెడిట్ విలువను సూచిస్తుంది. అయితే, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ స్కోరు వివరాలు అందించేందుకు క్రెడిట్ బ్యూరోలు యూజర్ నుంచి రూ.100 కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా పూర్తి క్రెడిట్ రిపోర్టు ఇవ్వాలని ఆర్బీఐ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
కేంద్రం తాజా ప్రకటనతో ఎంతో మందికి మేలు కలగనుంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా యువత, చిరువ్యాపారులు ఇలా చాలా మందికి క్రికెట్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో బ్యాంకుల్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరిస్తున్న పరిస్థితి.
కేంద్రం ప్రకటనతో తొలిసారి రుణాలు తీసుకునేందుకు సిద్ధమయిన వారు క్రెడిట్ స్కోర్ లేకుండానే బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ధైర్యం చేయొచ్చు. ఇది ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచడంతో పాటు ఎక్కువ మందికి రుణ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది.