దసరా, దీపావళికి 22 స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయి.. ఇవే రూట్స్.. డేట్స్ చెక్ చేసుకోండి.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి..

Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో

దసరా, దీపావళికి 22 స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయి.. ఇవే రూట్స్.. డేట్స్ చెక్ చేసుకోండి.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి..

Special Trains

Updated On : August 25, 2025 / 10:40 AM IST

Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగుల్లో పట్టణ ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే వారికోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనుంది.

Also Read: Sanju Samson : సంజు శాంసన్ విధ్వంసం.. సెంచరీతో శుభ్‌మన్ గిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ ప్లేస్ నాదే..!

దసరా, దీపావళి, ఛత్ పండుగలకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ చెప్పారు. సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పారు.

 

ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు..

♦ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నాలుగు సర్వీసులు, సెప్టెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు.
♦ సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు కాచిగూడ – నాగర్‌సోల్ మధ్య నాలుగు సర్వీసులు, సెప్టెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు నాగర్ సోల్ – కాచిగూడ మధ్య నాలుగు సర్వీసులు నడుస్తాయని తెలిపారు.
♦ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సంత్రాగ్జి – చర్లపల్లి మధ్య మూడు సర్వీసులు, సెప్టెంబర్ 20నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు చర్లపల్లి – సంత్రాగ్జి మధ్య మూడు సర్వీసులు ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు.